Chiranjeevi: అక్కినేని కుటుంబం పై మంత్రి కొండా సురేఖ చేసిన అత్యంత హేయమైన, నీచమైన వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబం మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది. నిన్న సమంత, నాగార్జున, నాగ చైతన్య, అక్కినేని అమల వంటి వారు ఈ ఘటనపై స్పందించి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని వంటి వారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించి కొండా సురేఖా ని తప్పుబట్టారు. అయితే కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా కొండా సురేఖ స్పందిస్తూ ‘ఒక నాయకుడు తన రాజకీయ దురుద్దేశం కోసం చేస్తున్న పనుల గురించి ప్రస్తావించాను కానీ, సమంత ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఆమె స్వయంకృషి తో ఇండస్ట్రీ లో అంత స్థాయికి ఎదిగింది, ఆమె పై నాకు గౌరవం మాత్రమే కాదు, ఆమె నాకు ఆదర్శ స్త్రీ కూడా. నా వ్యాఖ్యల కారణంగా మీ మనోభావాలు దెబ్బ తినుంటే దయచేసి నన్ను క్షమించండి, నా వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.
ఇక్కడ కూడా ఆమె కేటీఆర్ ప్రస్తావన తీసుకొని రావడం గమనార్హం. అయితే ఈ ట్వీట్ ఆమె నిజంగా, ట్విట్టర్ లో ఉన్నదీ ఆమేనా అనే విషయం ఇంకా నిర్ధారణకు రాలేదు. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కొండా సురేఖ తీరుని తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతూ ‘ గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను చూసి నేను చాలా చింతిస్తున్నాను. సినీ ప్రముఖులు ప్రతీ దానికి సాఫ్ట్ టార్గెట్ అవ్వడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేమంతా ఒక తాటిపైకి వచ్చి తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను, అది కూడా గౌరవంగా బ్రతుకుతున్న ఒక మహిళను అసత్యపూరితమైన కల్పిత ఆరోపణలు చేయడం చేసి రాజకీయ లబ్ది కోసం ఈ స్థాయిలో ఎవ్వరూ దిగజారకూడదు.
ఒకప్పుడు నేను పని చేసిన పార్టీ కి సంబంధించిన వాళ్ళ నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. సమాజం లో మేము ప్రశాంతంగా జీవించడానికి మాకు ఎన్ని పనులున్నా కూడా ఓటు వేసి నాయకులను ఎన్నుకుంటాము, చాలా బాధ్యతగా ఉండాలి. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో కూర్చున్న వాళ్ళు నలుగురికి ఆదర్శంగా నిలబడాలి కానీ అసహ్యించుకునేలా కాదు’ అంటూ చిరంజీవి చాలా ఘాటుగా స్పందించాడు. ఎవరినీ నొప్పించకుండా ఎంతో మర్యాదగా మాట్లాడే చిరంజీవి వంటి వారు కూడా ఈ స్థాయిలో ఫైర్ అయ్యారంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత నీచ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కష్టపడి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి స్థాయికి ఎదిగిన మహిళా ఇలా దిగజారి మాట్లాడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన కోసం యావత్తు సినీ లోకం ఎదురు చూస్తుంది.
I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister.
It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024