Goutham Raju: ముమ్మాటికి టాలీవుడ్ పెద్ద దిక్కుగా చిరంజీవిని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి అంతలా ఇండస్ట్రీలో ఆపద వచ్చినా.. సంతోషం వచ్చినా దాన్ని అందరితో పంచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడుస్తున్నాడు. వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. తాజాగా మరోసారి చిరంజీవి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
తెలుగు సహా వివిధ భాషల్లో దాదాపు 800 చిత్రాలకు పైగా ఎడిటర్ గా చేసిన గౌతం రాజు బుధవారం తెల్లవారుజామున అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుట పడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
గౌతం రాజు మరణ వార్త విని తెలుగు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. చిరంజీవి, రాంచరణ్, ఎన్టీఆర్, బాలయ్యకు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అయితే గౌతం రాజు మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆయనకు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
చిరంజీవి కెరీర్ లో అనేక సినిమాలకు ‘గౌతం రాజు’ ఎడిటర్ గా పనిచేశారు. దీంతో ఆయన మరణ వార్త విని చిరంజీవి తీవ్ర మనోవేదినకు గురయ్యారు. వెంటనే గౌతం రాజు కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2 లక్షల రూపాయలు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా పంపించారు. గౌతం రాజు కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉంటుందని చిరంజీవి అభయం ఇచ్చినట్టు తమ్మారెడ్డి భరోసా కల్పించారు.
గౌతం రాజుకు ఇద్దరు కుమారులు, భార్య. అంతా బాగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో ఆయన మరణం విషాదం నింపింది.