Chiranjeevi- Balakrishna: టాలీవుడ్ లో జాతకాలను నమ్మే స్టార్ హీరోల్లో బాలయ్య బాబు ముందు వరుసలో ఉంటారు. అసలు ముహూర్తాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే హీరోగా బాలయ్యకి పేరు ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి కూడా బాలయ్య ముహూర్తం చూసుకుంటాడు. అంతగా బాలయ్యకి ముహూర్తాల పిచ్చి ఉంది. అలాగే న్యూమరాలజీ సెంటిమెంట్ కూడా బాలయ్యకి ఉంది.
అయితే, బాలయ్య పిచ్చి మెగాస్టార్ కి కూడా సోకిందా ?, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇన్నాళ్లు చిరు పేరు CHIRANJEEVI అని ఉండేది. చిరు అలాగే రాసుకునేవారు. ఈ పేరుతోనే తిరుగులేని స్టార్ డమ్ తో తెలుగు ఇండస్ట్రీని ఏలారు. అయితే.. తాజాగా చిరు తన పేరును మార్చుకున్నారు. అదేమిటి ? చిరు తన పేరును మార్చుకోవాల్సిన అవసరం ఏమిటి ? కారణం ఆచార్య ప్లాప్.
Also Read: Goutham Raju: గౌతం రాజు కుటుబానికి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి.. ఎంత సాయం చేశాడో తెలుసా?
ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం.. చిరంజీవి అనే పేరులో ఉన్న దోషం అట. ఇంతకంటే కామెడీ మరొకటి లేదు. కానీ ఏమి చేస్తాం. దీన్ని మెగాస్టార్ కూడా నమ్మేశాడు. మరి ఏ స్వామి గారు చెప్పారో గానీ.. చిరంజీవి తన పేరులో మరో ‘ఈ’ తగిలించారు. CHIRANJEEVI కాస్త.. ఇప్పుడు CHIRANJEEEVIగా మారింది. డబుల్ ‘ఈ’ స్థానంలో.. త్రిబుల్ ‘ఈ’ వచ్చి చేరింది.
టాలీవుడ్ లో ఇలాంటి పిచ్చి నమ్మకాల జోలికి ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీ వెళ్ళలేదు. కానీ.. సడెన్ గా చిరు ఇలా పేరు మార్చుకున్నారు కాబట్టి.. ఇక చేసేది ఏమి లేదు. న్యూమరాలజీ కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోతుంది. నిజానికి ఈ పద్ధతి ఇన్నాళ్లు బాలయ్యకు మాత్రమే సాధ్యం అనుకున్నారు. కానీ.. బాలయ్యకి పోటీగా నేను ఉన్నాను అంటూ చిరు ఎంట్రీ ఇచ్చారు.
అయినా సినిమాల టైటిల్ స్పెల్లింగ్ లు ఇలా న్యూమరాలజీ ప్రకారం పెట్టడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. పైగా తెలుగులో నితిన్ లాంటి హీరో కూడా తన పేరులో డబుల్ ఐ తగిలించుకుని.. అప్పటి నుంచి హిట్లు అందుకుంటున్నాడు. కాకపోతే.. బాలయ్య పోటీ మాత్రం మెగాస్టారేనట.
Also Read:69 Countries In Srilanka Way: 69 దేశాలు ‘శ్రీలంక’ లాగానే మునగడానికి సిద్ధం!