https://oktelugu.com/

Megastar Chiranjeevi: పునీత్ మరణ వార్త విని నోట మాట రాలేదన్న… మెగాస్టార్

Megastar Chiranjeevi: కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఉదయం గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్… పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంఘీభావంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు  ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ విషయం […]

Written By: , Updated On : October 29, 2021 / 06:11 PM IST
Follow us on

Megastar Chiranjeevi: కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఉదయం గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్… పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంఘీభావంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
megastar chiranjeevi emotional tweet about puneeth raj kumar death
ఈ మేరకు  ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యానని… పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళిన తనను పునీత్ రాజ్ కుమార్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్ మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రాలేదు” అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

అలానే పునీత్ రాజ్ కుమార్ మృతికి సంఘీభావంగా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.  పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా నిలుస్తుంది.