Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం శాండిల్ వుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఈరోజు ఉదయం పునీత్ కు గుండెనొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించి మరణించారు. పునీత్ చెన్నైలో పుట్టారు. ఆరేళ్ల వయసున్నప్పుడే కుటుంబం అంతా మైసూర్ కు వెళ్లి స్థిరపడ్డారు. పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే కెరీర్ మొదలుపెట్టారు.

2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో ‘ఇడియట్’ సినిమాకు రిమేక్. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఫ్యాన్స్ అందరూ పునీత్ ను అప్పు పవర్ స్టార్ అని పిలుస్తారు.
పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలోనూ ఇలాంటి తీవ్ర విషాదాలు ఉన్నాయి. పునీత్ అన్న శివరాజ్ కుమార్ కూడా ఇలానే గుండెపోటుకు గురయ్యాడు. అచ్చం అలాగే ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన లోకాన్ని విడిచిపెట్టి పోయారు.
ఇక మరో తమ్ముడు కూడా ఇలానే అచ్చం గుండెపోటుకు గురైతే ఒకచేతి పనిచేయకుండా పోయింది. ఇలా పునీత్, అన్నయ్య గుండెపోటుతో మరణిస్తే ఆయన తమ్ముడు విగతజీవిగా పడి ఉన్నాడు. వీరి కుటుంబాన్ని గుండెపోటు కబళిస్తోంది.