MegaStar-Anil Ravipudi: కరోనా లాక్ డౌన్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక పక్క నష్టం, మరోపక్క లాభం చేకూరింది. జనాలు ఓటీటీ కి అలవాటు పడడం వల్ల థియేటర్స్ కి రావడం బాగా తగ్గించేశారు. ఓటీటీ డిమాండ్ పెరగడం వల్ల టాలీవుడ్ నిర్మాతల పాలిట వరం లాగా మారింది. నిర్మాతలు ఎంత అడిగితే అంత రేట్స్ ఇచ్చి ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసేవారు. ఫలితంగా సదరు సినిమా థియేటర్స్ లో ఆడినా, ఆడకపోయినా నిర్మాతకు నష్టం వచ్చేది కాదు, టేబుల్ ప్రాఫిట్స్ తో చాలా సేఫ్ గా ఉండేవాడు. అయితే ఈమధ్య కాలం లో ఓటీటీ కి డిమాండ్ తగ్గిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా చూడనిదే కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమాకు ఓటీటీ రైట్స్ ని క్లోజ్ చేయడమంటే చాలా పెద్ద పని.
Also Read: బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ ‘సోలో బాయ్’ మూవీ పరిస్థితి ఏంటి..? ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు ఎంతంటే!
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రెస్టీజియస్ మూవీ ‘విశ్వంభర'(Viswambhara Movie) ఓటీటీ రైట్స్ ని అమ్మడానికి నిర్మాతలు ఎంత కష్టపడ్డారో మనమంతా చూసాము. చివరికి ఈ సినిమాని జియో హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమా పరిస్థితి అలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పరిస్థితి మరోలా ఉంది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి చిన్న టీజర్ రాలేదు, ఫస్ట్ లుక్ విడుదల అవ్వలేదు, కనీసం టైటిల్ ఏంటో కూడా తెలియదు. కానీ ఈ సినిమా ఓటీటీ రైట్స్ అప్పుడే అమ్ముడుపోయింది. రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని టాక్. అది కూడా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే. మిగతా భాషలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట.
Also Read: ఆ స్టార్ హీరో కి ఉన్నట్టు నాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు..అందుకే ఫ్లాపులు – విజయ్ దేవరకొండ
దీనిని బట్టీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం కావడం, దానికి అనిల్ రావిపూడి బ్రాండ్ కూడా తోడు అవ్వడం వల్లే ఈ సినిమాకు మార్కెట్ లో అంతటి డిమాండ్, క్రేజ్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి కి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సెకండ్ హాఫ్ నుండి ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. వెంకటేష్ కి ప్రత్యేకంగా ఒక ఫైట్ సన్నివేశం, ఒక మంచి సాంగ్, చిరంజీవి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉంటాయట. ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెజాన్ ప్రైమ్ సంస్థ ముందు వెనుక ఆలోచించకుండా డీల్ ముగించింది.