https://oktelugu.com/

CM Jagan: జగన్ ను జైలుకు పంపడానికి బీజేపీ రెడీ అయ్యిందా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ బీజేపీ మిత్రులుగా ఉన్నట్లున్నా ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇప్పటిదాకా తమ బలాబలాలు చూసుకుని సమర్థించుకున్న రెండు పార్టీలు ప్రస్తుతం ఉత్తర ధృవం దక్షిణ ధృవంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ బీజేపీ తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇంత కాలం విరోధులుగా లేకున్నా ప్రస్తుతం ఆ ఛాయలే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా విమర్శలు చేసుకోకుండా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2021 11:50 am
    Follow us on

    CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ బీజేపీ మిత్రులుగా ఉన్నట్లున్నా ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇప్పటిదాకా తమ బలాబలాలు చూసుకుని సమర్థించుకున్న రెండు పార్టీలు ప్రస్తుతం ఉత్తర ధృవం దక్షిణ ధృవంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ బీజేపీ తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇంత కాలం విరోధులుగా లేకున్నా ప్రస్తుతం ఆ ఛాయలే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా విమర్శలు చేసుకోకుండా అట మిత్రపక్షంలో చేరకున్నా బీజేపీ వైసీపీ చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లే కనిపించాయి. అవసరమైన సమయాల్లో బీజేపీకి అండగా నిలవడంలో జగన్ కూడా తన పనులు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం రెండు పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

    jagan javadekar

    jagan javadekar

    రాష్ర్టంలో అవినీతి పాలన సాగుతోందిని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ చెప్పడం ఆలోచించాల్సిందే. దీంతో రెండు పార్టీలు ఎడమొహం పెడమొహంలా మారాయని తెలుస్తోంది. మంగళవారం నిర్వహించిన ప్రజాగ్రహ సభలో మంత్రి వైసీపీ పాలనను ఎండగట్టడం విశేషం. ఇన్నాళ్లు రెండు పార్టీల్లో ఉన్న ఒప్పందం తుంగలో కలిసినట్లు తెలుస్తోంది. అందుకే నువ్వా నేనా అన్న రీతిలో విమర్శలకు దిగుతున్నాయి. మరోవైపు నేతల అవినీతి రుజువైతే జైలుకెళ్లడం ఖాయమే అని మంత్రి ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కు బీజేపీకి చెడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో జగన్ అవినీతి రుజువైతే జైలుకు పంపేందుకు కేంద్రం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read:  కళాకారుల ప్రతీకారం అధికారానికే ముప్పు.. జగన్ ఆలోచించు !

    ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిరోధించడంలో కూడా వైసీపీ విఫమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎర్రచందనం దొంగ రవాణా చేస్తూ రూ. కోట్ల సంపదను కొల్లగొడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆపడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రకృతి సంపద దొంగల పాలవుతోందని విమర్శలున్నాయి. ఇంకో వైపు మత్తు పదార్థాల వినియోగం కూడా పెరిగిపోతోంది. గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాల రవాణా కూడా యథేచ్ఛగా జరుగుతోంది. దీనిపై కూడా ప్రభుత్వం నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.

    దీంతో కేంద్ర మంత్రి చేస్తున్న వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయాలు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకుని మంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దూరం చేసి బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ బలం క్రమంగా తగ్గుతోందని తెలుసుకుని కేంద్రం దాన్ని పక్కన పెట్టే విధంగా ఆరోపణలు చేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఏవైనా అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: పీఆర్సీపై జగన్ కీలక భేటీ.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేనా?

    Tags