https://oktelugu.com/

Mega Star Mammootty In Akhil Agent: ‘అఖిల్’ కోసం మెగాస్టారే దిగాడు.. వర్కౌట్ అవుతుందా ?

Mega Star Mammootty In Akhil Agent: దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. కాగా ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆయన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అఖిల్‌ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అఖిల్ ది మొదట […]

Written By:
  • Shiva
  • , Updated On : March 7, 2022 / 04:14 PM IST
    Follow us on

    Mega Star Mammootty In Akhil Agent: దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. కాగా ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆయన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అఖిల్‌ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది.

    Akhil Akkineni

    ఇక ఈ సినిమాలో అఖిల్ ది మొదట సిక్స్ ప్యాక్ అన్నారు. ఆ తర్వాత అంతకు మించి అంటున్నారు. దానికి తగ్గట్టుగానే అఖిల్ కూడా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ కొత్త లుక్ చాలా వైల్డ్ గా ఉంది. తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు. నిజానికి అఖిల్ చాలా కాలంగా జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాడు.

    Mammootty

    అయితే, అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు.

    Also Read: RRR Movie Story Leaked: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ లీక్.. విషాదంతమేనా?

    అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. కాగా తన కష్టానికి తగ్గట్టుగానే ఈ ఏజెంట్ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు. మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు.

    మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు. మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయినా కండలతో పాటు బడ్జెట్ కూడా పెంచితే కష్టం అని ఎందుకు అర్థం కావడం లేదో ?. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    Also Read: N. T. Rama Rao: అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ మిరపకాయలు తీసుకుని నమిలేశాడు.. అది చూసిన వాణిశ్రీ.. !

    Tags