https://oktelugu.com/

వైర‌ల్ పిక్ః ఒకే బెడ్డుపై మెగా హీరోలు..!

ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హ‌వా న‌డుస్తోంది. ఎవ్వ‌రికీ అర్థం కాని విష‌యం ఒకటుంది. ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు అంటూ.. ఎంతోమంది అవ‌స్థ‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌డా బ‌డా హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ వార‌సుల‌ను ఘ‌నంగా లాంఛ్ చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. కానీ.. వారికి ఒక్క స‌క్సెస్ రావ‌డం కూడా గ‌గ‌న‌మైపోతోంది. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వ‌రు వ‌చ్చినా.. విజ‌యం అందుకోవ‌డం.. స‌క్సెస్ ఫుల్ హీరోల జాబితాలో చేరిపోవ‌డం న‌డుస్తోంది. […]

Written By:
  • Rocky
  • , Updated On : June 27, 2021 / 04:36 PM IST
    Follow us on

    ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హ‌వా న‌డుస్తోంది. ఎవ్వ‌రికీ అర్థం కాని విష‌యం ఒకటుంది. ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు అంటూ.. ఎంతోమంది అవ‌స్థ‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌డా బ‌డా హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ వార‌సుల‌ను ఘ‌నంగా లాంఛ్ చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. కానీ.. వారికి ఒక్క స‌క్సెస్ రావ‌డం కూడా గ‌గ‌న‌మైపోతోంది. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వ‌రు వ‌చ్చినా.. విజ‌యం అందుకోవ‌డం.. స‌క్సెస్ ఫుల్ హీరోల జాబితాలో చేరిపోవ‌డం న‌డుస్తోంది. ఈ సీక్రెట్ ఏంట‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ అంతుప‌ట్ట‌ట్లేదు.

    నిన్న‌టికి నిన్న వ‌చ్చిన వైష్ణ‌వ్ తేజ్ కూడా ఎంత ఘ‌నంగా ఖాతా తెరిచాడో తెలిసిందే. ఈ విక్ట‌రీని మెగా ఫ్యామిలీ ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఇంట‌ర్వ్యూలతో మెగా వార‌సులు సంద‌డి చేశారు. అయితే.. లేటెస్ట్ గా ఓ ఫోట్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఈ ఫొటో కొద్దిసేప‌ట్లోనే వైర‌ల్ అయిపోవడం విశేషం.

    ఎందుకంత స్పెష‌లో చూశారా? వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ ముగ్గూరు ఒకే బెడ్డుపై ప‌డుకొని ఉన్నాడు. ఇందులో వైష్ణ‌వ్ టీష‌ర్ట్ కూడా లేకుండా బ్లాంకెట్ క‌ప్పుకోగా.. వ‌రుణ్‌, సాయితేజు మాత్రం టీష‌ర్టుల‌తో ఉన్నారు. ఇక‌, సాయి తేజు నిద్రిస్తున్న‌ట్టు న‌టిస్తుండ‌గా.. వ‌రుణ్ మాత్రం ఒక క‌న్ను తెరిచి స్మైల్ ఇచ్చాడు.

    తామంతా చిన్న‌నాటి నుంచి ఫ్రెండ్స్ గా మెలుగుతున్నామ‌ని త‌రచూ చెబుతున్న సంగ‌తి తెలిసిందే. చెప్ప‌డ‌మేకాదు.. పలుమార్లు కూడా ఈ విష‌యాన్ని నిరూపించారు. ఇప్పుడు ఈ స‌ర‌దా ఫొటోతో మ‌రోసారి త‌మ మ‌ధ్య ఉన్న స్నేహాన్ని చాటిచెప్పారు. ఈ స‌ర‌దా దృశ్యం వైర‌ల్ అయిపోయింది. ఫ్యాన్స్ ఫ‌న్నీ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.