Mega Family: మెగా ఫ్యామిలీ లోకి త్వరలోనే మరో యంగ్ హీరోయిన్ కోడలిగా ఎంట్రీ ఇవ్వబోతుందా..?, లావణ్య త్రిపాఠీ కి తోడుగా ఇంకొకరు రాబోతున్నారా? అంటూ ఫిలిం నగర్ లో ఒక పుకారు షికారు చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఒక స్టార్ కిడ్, యంగ్ హీరోయిన్ గా గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని , ఇలా పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీళ్లిద్దరు కూడా ప్రస్తుతం కెరీర్ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారని ఒక హింట్ కూడా ఇచ్చారు ఇండస్ట్రీ కి చెందిన కొందరు జర్నలిస్టులు. మరి ఎవరు స్టార్ కిడ్..?, ప్రస్తుతం స్టార్ కిడ్స్ అందరికీ దాదాపుగా పెళ్లిళ్లు అయిపోయాయి. మిగిలి ఉన్నది కేవలం ముగ్గురే. అది అక్కినేని ఫ్యామిలీ నుండి సుశాంత్ , అదే విధంగా మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్.
చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సుశాంత్ , మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పైన చెప్పిన దాని ప్రకారం చూస్తే , ఇద్దరూ ప్రస్తుతం ఫెయిల్యూర్స్ లో ఉన్నారని. సుశాంత్ ఫెయిల్యూర్స్ లోనే ఉన్నాడు కానీ, మీనాక్షి చౌదరి మాత్రం లేదు. రీసెంట్ గానే ఈమె ‘అనగనగ ఒక రాజు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పరంగా కూడా చేతినిండా అవకాశాలతో ముందుకు దూసుకుపోతోంది. ఇక మిగిలింది సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గురించి ఇప్పటి వరకు చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన నిజంగానే ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది , త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సమాచారం ఉంది కానీ , పెళ్లి కూతురు ఇండస్ట్రీ కి చెందిందా ?, కాదా ? అనేది తెలియాల్సి ఉంది.
కానీ పైన చెప్పిన లెక్క ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఫెయిల్యూర్స్ లో లేడు, ఆయన కెరీర్ కూడా రాబోయే రోజుల్లో గొప్పగా ఉండబోతుంది. కాబట్టి, కచ్చితంగా పంజా వైష్ణవ్ తేజ్ గురించే ఇండస్ట్రీ లో ఆ రేంజ్ చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు నెటిజెన్స్. వైష్ణవ్ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అదే విధంగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉంది. ఇద్దరూ ఫెయిల్యూర్స్ లో ఉన్నారని అంటున్నారు కాబట్టి , కచ్చితంగా వీళ్ళే అయ్యుంటారని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య స్నేహం ‘ఉప్పెన’ సినిమా నుండి మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుంది, వీళ్లిద్దరి మధ్య ప్రేమ బంధానికి కూడా అవకాశం ఉంది , కాబట్టి కృతి శెట్టి మెగా ఫ్యామిలీ లోకి కోడలిగా ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు విశ్లేషకులు.
