https://oktelugu.com/

Pawan Kalyan movie Remake  : పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేయనున్న మెగా ఫ్యామిలీ హీరో…అది ఏ సినిమా అంటే..?

ఇండస్ట్రీ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడంలో అహర్నిశలు కష్టపడ్డాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 07:11 PM IST

    Pawan kalyan- Saidharam teja

    Follow us on

    Pawan Kalyan movie Remake  :  మెగా ఫ్యామిలీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో నందమూరి ఫ్యామిలీ ని ఎలాగైతే సినిమా ఇండస్ట్రీలో నిలిపాడో అలాగే చిరంజీవి కూడా మెగా ఫ్యామిలీ కి ఒక ఘన విక్టరీని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ముగ్గురు స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే వరుణ్ తేజ్, వైష్ణవి తేజ్ లు మాత్రం చిన్న సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వీళ్ళు ముగ్గురు మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ కి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఇక అప్పట్లో సాయి ధరమ్ తేజ్ ఒక యాక్సిడెంట్ కి గురైన విషయం కూడా మనకు తెలిసిందే.

    అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరుండి సాయి ధరమ్ తేజ్ కి కావాల్సిన అవసరాలను తీర్చాడు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బ్రో అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం ఏదైనా ఒక సినిమాని రీమేక్ చేయాల్సి వస్తే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాని రీమేక్ చేస్తానని చెబుతున్నాడు.

    ఇక తను నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో తమ్ముడు సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ నుంచే తన ఇంట్రాడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి తమ్ముడు సినిమా అంటే తనకు అమితమైన ఇష్టమని అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన కూడా చాలా బాగా ఉంటుందని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇంకా ప్రస్తుతం ఆయన రీమేక్ చేయాల్సి వస్తే తమ్ముడు సినిమాని తప్పకుండా రీమేక్ చేస్తానని చెప్పడం విశేషం… ఒక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఈ సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నం తను ఉన్నట్టుగా తెలుస్తోంది…