https://oktelugu.com/

అటువైపు చూస్తున్న మెగాస్టార్ కూతురు..!

దేశంలో లాక్డౌన్ కారణంగా చిత్రసీమ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగ్లు వాయిదా పడిన పరిస్థితుల్లోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎంటటైన్మెంట్ రంగంలో హవా కొనసాస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో ఫోన్లలోనే మూవీలు చూసేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతోన్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త వెబ్ సీరిస్ లతో అభిమానులతో అలరిస్తున్నాయి. వీటి కంటెంట్ సినిమాకు మంచి ఉండటంతో అభిమానులు వీటికి అట్రాక్ట్ అవుతోన్నాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు ఇప్పటికే […]

Written By: , Updated On : May 15, 2020 / 03:51 PM IST
Follow us on

దేశంలో లాక్డౌన్ కారణంగా చిత్రసీమ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగ్లు వాయిదా పడిన పరిస్థితుల్లోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎంటటైన్మెంట్ రంగంలో హవా కొనసాస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో ఫోన్లలోనే మూవీలు చూసేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతోన్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త వెబ్ సీరిస్ లతో అభిమానులతో అలరిస్తున్నాయి. వీటి కంటెంట్ సినిమాకు మంచి ఉండటంతో అభిమానులు వీటికి అట్రాక్ట్ అవుతోన్నాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెడుతోన్నారు. మరికొందరు సొంతంగా వెబ్ సీరిస్ లను నిర్మిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగానికి మంచి భవిష్యత్ ఉండటంతో ప్రతీఒక్కరూ అటువైపు చూస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుస్మిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మించే బదులు వెబ్ సీరిస్ లు తీస్తే బెటరని సుస్మిత భావిస్తుందట. ఇందులో భాగంగా త్వరలోనే సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అంతేకాకుండా మెగా హీరోలతో వెబ్ సీరిస్ లు నిర్మించి తన ఓటీటీ మాధ్యమంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుందట. సుస్మిత ఆలోచనకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన కూతురు సుస్మిత తీయబోయే వెబ్ సీరిస్ నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సుస్మిత మెగాస్టార్ చిరంజీవికి నటించిన ‘ఖైదీ-150’, ‘సైరా’ మూవీలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకొంది.