https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్: నీహారిక’కు కాబోయే భర్త ఎవరంటే..!

మెగా వారసురాలు నీహారిక కొణిదెల తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టు చేయడంతో త్వరలోనే ఆమె ఒకింటామె కాబోతుందని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి మాకు తెలిసిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఓ పోలీస్ అధికారి కుమారుడితో నిహారిక పెళ్లి జరగబోతుంది. నాలుగు రోజుల క్రితమే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక తన కుమార్తె పెళ్లి పై […]

Written By:
  • admin
  • , Updated On : June 18, 2020 / 03:54 PM IST
    Follow us on


    మెగా వారసురాలు నీహారిక కొణిదెల తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టు చేయడంతో త్వరలోనే ఆమె ఒకింటామె కాబోతుందని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి మాకు తెలిసిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఓ పోలీస్ అధికారి కుమారుడితో నిహారిక పెళ్లి జరగబోతుంది. నాలుగు రోజుల క్రితమే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక తన కుమార్తె పెళ్లి పై నాగబాబు కూడా ఇటీవలే క్లారిటీ ఇస్తూ.. నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తానని అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో నిహారిక పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కొణిదెల వారి ఇంటి నుంచి శుభవార్త రావడంతో మెగా అభిమానులంతా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఆమె తమిళ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళుతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె ఓ సినిమాలో నటించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో ఓ ప్రత్యేక అతిధి పాత్రలో నిహారిక కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిహారిక, రామ్ చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించబోతుందట, నిహారిక కనిపించే సీన్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నారు.