https://oktelugu.com/

Lavanya Tripathi : రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వరుణ్ తేజ్ కంటే రెండింతలు ఎక్కువ!

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేస్తాను అని చెప్పలేదు కానీ, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తాను అని అంటోంది. పెళ్లి తర్వాత ఆమె నుండి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ, లావణ్య త్రిపాఠి కి మంచి పేరుని తెచ్చిపెట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 09:33 PM IST
    Follow us on

    Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె అందరి హీరోయిన్స్ లాగ అందాల ఆరబోతకు పూర్తిగా వ్యతిరేకం. సన్నివేశం డిమాండ్ ని బట్టీ ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ కి తగ్గట్టుగా అడల్ట్ కంటెంట్ చిత్రాలు చెయ్యడానికి పెద్ద స్టార్ హీరోయిన్స్ అందరూ క్యూలు కడుతున్నారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం ఆమె గీకుకున్న గీత ఇప్పటి వరకు దాటలేదు. అందుకేనేమో ఆమె మెగా ఇంటికి కోడలు అయ్యింది. సుమారుగా 5 ఏళ్ళ పాటు వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపి డేటింగ్ చేసిన లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు ఈమధ్యనే అతన్ని పెళ్లి చేసుకుంది.

    పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేస్తాను అని చెప్పలేదు కానీ, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తాను అని అంటోంది. పెళ్లి తర్వాత ఆమె నుండి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ, లావణ్య త్రిపాఠి కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన లావణ్య ఈమధ్యనే రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఒక్కో సినిమాకి దాదాపుగా 50 నుండి 70 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. వాస్తవానికి ఆమె స్టార్ లీగ్ హీరోయిన్ కాదు కాబట్టి కోటి లోపే రెమ్యూనరేషన్ ని తీసుకుంది. ఆమె తోటి హీరోయిన్లు మాత్రం ప్రస్తుతం ఒక్కొక్కరు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి అందాల ఆరబోతకు, లిప్ లాక్ సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమెకి కూడా ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు.

    అయితే లావణ్య త్రిపాఠి ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తే ఆమెకి గంటకి 50 లక్షల రూపాయిలు ఇవ్వాలట. అంటే ఆమె ఒక్క రోజు మొత్తం కేటాయిస్తే రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. వరుణ్ తేజ్ ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రెండు రేట్లు పైగానే ఉంటుంది. ఒకప్పుడు ఈమెకి అంత రెమ్యూనరేషన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఆమె మెగా కోడలు అయ్యింది కాబట్టి ఆమె డిమాండ్ ఇంత పెరిగిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రాబొయ్యే సినిమాలకు కూడా ఆమె ఇప్పుడు తనకి ఉన్న క్రేజ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ని తీసుకోబోతుంది అట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం . చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ ఈమె ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో దూసుకుపోతుంది అనేది.