https://oktelugu.com/

వర్మ ‘పైసా’చికత్వంపై మెగా క్యాంప్ ఫైట్?

రాంగోపాల్ వర్మ.. ఈ టాలీవుడ్ దర్శకుడు ఇప్పుడు మరీ బూతు సినిమాల దర్శకుడిగా మారిపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్ననే ‘నగ్నం’,పోర్న్ స్టార్ మియా మాల్కోవోతో మరో ‘క్లైమాక్స్’ తీసి వర్మ తన పరువును తానే తీసుకున్నాడు. ‘శివ’ లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వర్మ ఇప్పుడు తన క్రియేటివిటీని మొత్తం చంపేసుకొని బూతు సినిమాల దర్శకుడిగా మారిపోవడమే విది వైచిత్యం. Also Read: జులై 26, రాత్రి 8.30కు బ్యాచ్‌లర్ లైఫ్కు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2020 / 05:00 PM IST
    Follow us on


    రాంగోపాల్ వర్మ.. ఈ టాలీవుడ్ దర్శకుడు ఇప్పుడు మరీ బూతు సినిమాల దర్శకుడిగా మారిపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్ననే ‘నగ్నం’,పోర్న్ స్టార్ మియా మాల్కోవోతో మరో ‘క్లైమాక్స్’ తీసి వర్మ తన పరువును తానే తీసుకున్నాడు. ‘శివ’ లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వర్మ ఇప్పుడు తన క్రియేటివిటీని మొత్తం చంపేసుకొని బూతు సినిమాల దర్శకుడిగా మారిపోవడమే విది వైచిత్యం.

    Also Read: జులై 26, రాత్రి 8.30కు బ్యాచ్‌లర్ లైఫ్కు గుడ్‌బై

    వర్మ తీసిన ‘శివ’ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. నాగార్జునకు బంపర్ హిట్ ఇచ్చింది. మొన్నీమధ్య వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలాగా ట్రెండ్ సెట్ చేసింది. అంతటి క్రియేటివిటీతో అలరాలిన వర్మ టాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టాడు. బిగ్ బి అమితాబ్ సహా చాలా మంది అగ్రహీరోలతో సినిమాలు తీశాడు. హర్రర్ , క్రైమ్ ను ఎంచుకొని ఇప్పుడు బూతునే పరమావధిగా మలుచుకున్నాడు.

    ఇప్పుడు వర్మ పని టాలీవుడ్ అయిపోయింది. ఆయన ఎన్ని జీవిత కథలు తీసినా ఆ చెత్త సినిమాలను చూడలేక జనాలు తిరస్కరిస్తున్నారు. ఫ్లాప్ చేశారు. అప్పట్లో వర్మ తీసిన రాయలసీమ పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ ‘రక్త చరిత్ర’ తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు.

    అయితే ఇప్పుడు వర్మలో పూర్తిగా క్రియేటివిటీ చచ్చిపోయింది. మరి బతకాలి కదా.. అందుకే వివాదాస్పద సినిమాలను ఎంచుకుంటున్నారు. మొన్నటికీ మొన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఇప్పుడు ‘పవర్ స్టార్’ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ను బజారు కీడ్చే పనులు పెట్టుకున్నారు. ఇందులో చిరంజీవిని చూపించేసరికి మెగా క్యాంప్ రంగంలోకి దిగినట్టు తెలిసింది.

    Also Read: మహేశ్‌ మెచ్చిన తమిళ్‌ మూవీ..

    అందరిపై సినిమా తీస్తున్న వర్మపైనే తాజాగా ‘పరాన్న జీవి’ అంటూ అందరిపై బతికేవాడు అని అర్థం వచ్చేలా ఓ సినిమా తీశారు. దాని వెనుక ఉన్నది మెగా ఫ్యామిలీనే అని టాక్. ఈ సినిమాను శ్రేయాస్ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మెగా ఫ్యామిలీనే దగ్గరుండి రిలీజ్ కు ప్లాన్ చేశారని తెలిసింది.

    మెగా హీరో పవన్ ను, చిరంజీవిని టార్గెట్ చేసిన వర్మను అంత ఈజీగా వదలొద్దని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయ్యిందట.. ఇక నుంచి వర్మ తీసే సినిమాలేవీ తెలుగు, జాతీయ స్థాయి ఓటీటీల్లో రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ లు రెడీ అయినట్టు తెలిసింది. అందుకే వర్మ సొంతంగా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ’ యాప్ ను తయారు చేసినట్టు వినికిడి. తమపై సినిమాలు తీసి అవమానిస్తున్న వర్మ కు ఉన్న అన్ని అవకాశాలు మూసుకునేలా మెగా ఫ్యామిలీ ముందుకెళుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ లో వర్మను ఒంటరిని చేసేలా ప్లాన్ చేశారట..

    అందుకే వర్మ తాజాగా ‘పవర్ స్టార్ ’ ట్రైలర్ కు కూడా రూ.25 పెట్టి చూడాలనే నిబంధన పెట్టారని.. ఇలా పవన్ పేరు చెప్పి అమ్ముకుంటున్నారే ప్రచారం మొదలైంది.