https://oktelugu.com/

అడవిలో ‘బందీ’గా హీరో ఆదిత్య ఓం

హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా? మనకు బాగా తెలిసిన పేరే. కానీ, చూసి చాన్నాళ్లయింది. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ తో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోనే ఆదిత్య. ఆ తర్వాత తెలుగులో అడపదడపా చాలా సినిమాల్లనే నటించాడు. హిందీలో కూడా పలువు చిత్రాలు చేశాడు. కానీ, పెద్దగా విజయాలు అందుకపోతున్నాడు. అయినా సరే పోరాటం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, గతానికి భిన్నంగా ఈ సారి ఓ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 05:12 PM IST
    Follow us on


    హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా? మనకు బాగా తెలిసిన పేరే. కానీ, చూసి చాన్నాళ్లయింది. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ తో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోనే ఆదిత్య. ఆ తర్వాత తెలుగులో అడపదడపా చాలా సినిమాల్లనే నటించాడు. హిందీలో కూడా పలువు చిత్రాలు చేశాడు. కానీ, పెద్దగా విజయాలు అందుకపోతున్నాడు. అయినా సరే పోరాటం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, గతానికి భిన్నంగా ఈ సారి ఓ డిఫరెంట్‌ మూవీతో ఆదిత్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బందీ’ ఫస్ట్‌లుక్‌ సోమ‌వారం విడుద‌లైంది. ఇందులో హీరో అడ‌విలో ‘బందీ ‘అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఒంటిపై చొక్కా లేకుండా రెండు చేతులకు ఓ చెట్టుకు కట్టేయగా.. మోకాళ్లపై కూర్చుని బాధ పడుతూ కనిపించాడు హీరో. అత‌ని ఛాతీపై తొండ పాకుతుండ‌గా ప‌క్కనే ఉన్న చెట్టుకు ఓ అనకొండ బుసలు కొడుతోంది. పోస్టర్చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది.

    Also Read: ఓటీటీలో రానున్న కాజల్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’!

    ఇలాంటి పాత్ర చేసేందుకు చాలా ధైర్యం కావాలని అభిమానులు అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ మొత్తం అడవిలోనే జరిగింది. వన్య ప్రాణుల సంరక్షణ, ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ పై మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం ఇది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి టి. రాఘ‌వ దర్శకత్వం వహించాడు. రాకేశ్ గోవ‌ర్ధన‌గిరి, మధు సూద‌న్ కోట నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్‌ మొత్తం పూర్తయిన ఈ మూవీని గ‌తేడాదే రిలీజ్‌ చేయాలనుకున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడ్డ ‘బందీ’ త్వరలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

    Tags