Mega Brother Nagababu : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కాసేపటి కిరాటమే హైదరాబాద్ పోలీసులు గోవా లో అరెస్ట్ చేశారు. ఇటీవలే ఒక యంగ్ డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు ని నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో జానీ మాస్టర్ ని మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన పరారీలో ఉన్నట్టు తేలింది. పోలీసులు కూడా నెల్లూరు, నార్త్ ఇండియా ప్రాంతాలలో ముమ్మరంగా ఈయన కోసం గాలించారు. కానీ చివరికి గోవా లో ఉన్నాడు అనే విషయాన్నీ తెలుసుకొని, అక్కడ అరెస్ట్ చేసారు. అనంతరం గోవా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపేర్చిన పోలీసులు, పీటీ వారంట్ క్రింద హైదరాబాద్ కి తరలించారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపర్చనున్నారు పోలీసులు. ఈ ఘటన పట్ల టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా బాధితురాలికి అండగా నిలబడ్డారు.
ఫిలిం ఛాంబర్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, నాట్య మండలి సంఘం కి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసింది. అలాగే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక కీలక నేతగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన మీద ఈ ఆరోపణలతో కేసు నమోదు అవ్వగానే, ఆ పార్టీ ఆయనని వెంటనే సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇలాంటి నేపథ్యం నడుస్తున్న ఈ సమయంలో మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు జానీ మాస్టర్ కి సపోర్టుగా పరోక్షంగా ట్వీట్లు వేయడం కలకలం రేపింది. ఆయన మాట్లాడుతూ ‘ మీ చెవులతో వినే వాటిని నమ్మకండి. ప్రతీ స్టోరీ వెనుక మూడు కోణాలు ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సర్ విలియం గ్యారో చెప్పినట్టుగా ఏ వ్యక్తి కూడా కోర్టు లో నిజానిజాలు తేలేవరకు తప్పు చేసినట్టు ఫీల్ అవ్వకూడదు. అన్ని న్యాయస్థానమే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒకపక్క జనసేన పార్టీ జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసింది, ఇండస్ట్రీ మొత్తం కూడా అతనికి వ్యతిరేకంగా ఉంది, ఇలాంటి సమయంలో నాగబాబు ఇలా పబ్లిక్ గా సపోర్టు చేయడం పై జనసేన పార్టీ అభిమానులు మండిపడుతున్నారు.
జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని మీకు అనిపిస్తే అనాధికారికంగా మీకు తెలిసిన మంచి లాయర్స్ ని పెట్టించి కేసు నడిపించండి. అంతేకానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇలా పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ లో చెప్పకూడదు అంటూ నాగబాబు పై మండిపడ్డారు అభిమానులు. నాగబాబు కి ఇలా మాట్లాడడం కొత్తేమి కాదు, తన మనసులో ఉన్న భావాలను నిర్మొహమాటంగా బయటకి వ్యక్తపర్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి, దీని వల్ల ఆయన తీవ్రమైన నెగటివిటీ ఎదురుకోవడమే కాకుండా జనసేన పార్టీ కి కూడా తలవంపులు వచ్చేలా చేసాడు.
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
:- Sir William Garrow— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024