Navya Nanda: బాలీవుడ్ లో ప్రేమ పక్షులు ఎక్కువ. ఏ పక్షి ఎప్పుడు ఎక్కడ వాలుతుందో చెప్పలేనట్టే.. హిందీ చిత్ర సీమలో కూడా ఎవరు ఎవర్నీ ఎప్పుడు ప్రేమిస్తారో చెప్పడం కష్టం. కానీ, ప్రేమలో పడ్డాక ప్రేమ పక్షులు గుట్టుగా ఉండవు. స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అయితే, ఒక్కోసారి ఆ ప్రేమ తాలూకు రెక్కలు చప్పుళ్ళు పుకార్లుగా వినిపిస్తాయి. అప్పుడు ఆ పక్షులు ఆ పుకార్ల పై దాడికి దిగుతాయి.

మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ కొత్త కథను చెప్పడం మొదలుపెడతాయి. పైగా మంచి స్నేహితులను ప్రేమ పక్షులమని ప్రచారం చేయడం చాలా నీచం, చాలా అన్యాయం అంటూ ఎన్నో కాకమ్మ కబుర్లను కూడా ఆ పక్షులు చాలా బాగా చెబుతాయి. అసలు వ్యక్తిగత జీవితంలోని విషయాలను ఎందుకు పబ్లిక్ గా చెప్పాలి ? అంటూ చివరకు సన్నాయి నొక్కులు నొక్కుతాయి.
మొత్తమ్మీద మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయాక, ఇక ఆ పక్షులు పబ్లిక్ గానే బరితెగిస్తాయి. ఇదంతా హిందీ తారల ప్రేమ ముచ్చట్లులో భాగమే. ముఖ్యంగా హిందీ సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల రిలేషన్‌షిప్ లు అనేవి చిల్లులు పడ్డ షిప్ లు లాంటివి. ఎక్కడ మునిగిపోతుందో తెలియదు. అయితే, కొన్ని జంటలు మాత్రం, చాలా బాగా కలిసిపోతాయి.
అందుకే, అలాంటి జంటల పై ఎప్పుడు హిందీ మీడియా నిఖా ఉంచుతూనే ఉంటుంది. అయినా మీడియా కళ్ళు గప్పి ఓ యువ జంట తెగ తిరుగుతుందట. ఇంతకీ ఆ యువ జంట ఎవరు అంటే.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా, యువ నటుడు మీజాన్ జాఫేరీ. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అనేక రూమర్స్ వినిపించాయి.
వాటిల్లో ఎంత నిజం ఉందనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే, ఈ జంట ఈ మధ్య హిందీ మీడియా కళ్ళకు డైరెక్ట్ గా చిక్కుతున్నారు. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ జంట ప్రవర్తన ఉంది. అయినా నిప్పు లేనిదే పొగ ఎక్కడ నుంచి వస్తోంది ?
Also Read: Koratala Siva: ఎట్టకేలకు కొరటాల కల నెరవేరబోతోంది
కాబట్టి, అమితాబ్ బచ్చన్ మనవరాలితో కుర్ర హీరో మీజాన్ జాఫేరీ ఘాటు ప్రేమనే నడుపుతున్నాడని విస్తృత ప్రచారం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలా రిలేషన్‌షిప్ ల పై అనేక పుకార్లు విస్తృతంగా ప్రచారంలోకి రావడం సర్వసాధారణమే. అయితే, ఇక్కడ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందాతో రిలేషన్‌షిప్ అంటేనే హిందీ జనాల్లో ఆసక్తి పెరిగింది.
Also Read: Tollywood News: పాతికేళ్ళ హీరో కంటే.. పదేళ్ళు విలన్ కే ఎక్కువ సంపాదన !