https://oktelugu.com/

అమితాబ్‌ మనవరాలి పై యంగ్ హీరో కామెంట్స్ !

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు ‘నవ్య నవేలీ నందా’తో బాలీవుడ్‌ యంగ్ హీరో మీజాన్‌ జాఫేరీ ప్రేమలో పడ్డాడు అని, గత కొంత కాలంగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా తెగ పుకార్లను పుట్టిస్తోంది. అయితే ఈ వార్తల పై ఈ కుర్ర హీరో మండిపడుతున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నవ్య నవేలీని నేను ఘాడంగా ప్రేమిస్తున్నాను అని, ఇప్పటికే నా కారణంగా ఆమె గర్భవతి కూడా అయిందని ఇలా నీచమైన వార్తలు […]

Written By:
  • admin
  • , Updated On : July 1, 2021 / 02:30 PM IST
    Follow us on

    బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు ‘నవ్య నవేలీ నందా’తో బాలీవుడ్‌ యంగ్ హీరో మీజాన్‌ జాఫేరీ ప్రేమలో పడ్డాడు అని, గత కొంత కాలంగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా తెగ పుకార్లను పుట్టిస్తోంది. అయితే ఈ వార్తల పై ఈ కుర్ర హీరో మండిపడుతున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నవ్య నవేలీని నేను ఘాడంగా ప్రేమిస్తున్నాను అని, ఇప్పటికే నా కారణంగా ఆమె గర్భవతి కూడా అయిందని ఇలా నీచమైన వార్తలు రాస్తున్నారు.

    నేను ఎక్కడికి వెళ్లినా నవ్య నవేలి గురించే నన్ను ప్రశ్నిస్తున్నారు. నిజంగా, నిజాయితీగా చెప్తున్నాను. నేను ఆమెను ప్రేమించడం లేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. మీడియా ప్రముఖులందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. నా గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆమె పేరును ప్రస్తావించకండి. ఇది ఎంతో అన్యాయం అవుతుంది.

    నవ్య నవేలీ వ్యక్తిగత జీవితానికి గౌరవాన్ని ఇవ్వండి. చాలామందికి తెలియదు, నవ్య నాకు మాత్రమే కాదు, నా సోదరికి కూడా బెస్ట్‌ ఫ్రెండే. ఆ స్నేహం కారణంగానే ఆమె పలుసార్లు మా ఇంటికి వచ్చింది. అంతేగాని మరో ఏ ఉద్దేశ్యం లేదు. అయినా ప్రస్తుత కష్ట సమయంలో కూడా ఇలా వేరొకరి గురించి ఇష్టమొచ్చినట్లు రాయడం, ఆ చెత్త పుకార్లను జనంలోకి తీసుకువెళ్లడం దారుణం.

    మీకు తెలియదు, ఇలాంటి ఫేక్ కథనాలు కారణంగా నేను నా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా చాల ఇబ్బందిగా ఫీల్‌ అవ్వాల్సి వస్తోంది. మా పేరెంట్స్‌ నా వైపు చూసి ఏంటిదంతా? అన్నట్లు ఓ లుక్కిస్తే.. దానికి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేను’ ఆంటూ మీజాన్‌ స్పష్టం చేశాడు