https://oktelugu.com/

Samantha : సెకండ్ హ్యాండ్ అంటున్నారు… విడాకుల పై సమంత షాకింగ్ కామెంట్స్!

సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. సిటాడెల్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో... విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, అపవాదులను ఉద్దేశిస్తూ కీలక ఆరోపణలు చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : November 26, 2024 / 09:19 AM IST

    Samantha No. 1 Heroine

    Follow us on

    Samantha : సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. సిటాడెల్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో… విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, అపవాదులను ఉద్దేశిస్తూ కీలక ఆరోపణలు చేసింది. సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
     
    సమంత నటిగా సక్సెస్. 2010లో ఏమాయ చేసావే చిత్రంతో ఆమె కెరీర్ మొదలైంది. దాదాపు 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. టాప్ స్టార్స్ సరసన ఆమె జతకట్టారు. అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. సమంత అంటే ఒక లక్కీ చార్మ్ గా పరిశ్రమ చూసింది. అందుకే ఆమె కెరీర్ సాఫీగా సాగిపోతుంది. అయితే సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. అనేక సవాళ్ళను ఆమె ఎదుర్కొంటున్నారు. 
     
    ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు సమంతను తీవ్ర వేదనకు గురి చేశాయి. దానికి తోడు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు. ఆమెకు అఫైర్స్ ఉన్నాయి. కుటుంబ విలువలు పాటించడం లేదు.. అంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్, మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. విడాకులకు కారణం సమంతనే అన్నట్లు అందరూ సమంతను నిందించారు. 
     
    తాజాగా ఈ ఆరోపణలపై, విడాకులు అనంతరం తనకు ఎదురైన అవమానాలను ఉద్దేశిస్తూ సమంత మాట్లాడారు. ”విడాకులు తీసుకున్న అమ్మాయికి ఈ సమాజం కొన్ని ట్యాగ్స్  ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఇక ఆమె జీవితం వృద్ధా అనే బిరుదులు ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఒక అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఈ మాటలు ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న అమ్మాయిని మరింత నిరాశపరుస్తాయి. నాపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు కాబట్టి నేను స్పందించలేదు. విడాకుల సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారు…” అని సమంత అన్నారు. 
     
    నాగ చైతన్య-సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు వీరి వైవాహిక బంధం సవ్యంగా సాగింది. 2021లో మనస్పర్థలు తలెత్తాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలియజేశారు. కాగా సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్నారు. 
     
    గత రెండేళ్లుగా శోభిత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారు. ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య వివాహం జరగనుంది. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం. పెళ్లి నిరాడంబరంగా చేసుకోవాలని నాగ చైతన్య నిర్ణయించుకున్నాడని నాగార్జున తెలియజేశారు.