Meera Jasmine: మీరా జాస్మిన్ లేటు వయసులో ఘాటైన అందాలతో మతులు పోగొడుతుంది. ఒకప్పటి ఈ హోమ్లీ హీరోయిన్ నుండి ఇది ఊహించని యాంగిల్ అంటున్నారు నెటిజెన్స్. 2001లో మలయాళ చిత్రం సూత్రధారన్ తో వెండితెరకు పరిచయం అయ్యింది మీరా జాస్మిన్. సౌత్ ఇండియాలో పాప్యులర్ హీరోయిన్ గా ఫేమ్ రాబట్టింది. ఆమె నటించిన తమిళ చిత్రాలు రన్, ఆయుత ఇజుత్తు, సందకోజి తెలుగులో కూడా విజయం సాధించాయి. ఇక అమ్మాయి బాగుంది మూవీతో తొలి స్ట్రెయిట్ మూవీ చేసింది. శివాజీ హీరోగా నటించాడు. అమ్మాయి బాగుంది హిట్ టాక్ తెచ్చుకుంది.
అనంతరం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్-మీరా జాస్మిన్ కాంబోలో వచ్చిన గుడుంబా శంకర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాగే బాలయ్యకు జంటగా మహారథి చేసింది. ఈ చిత్రం కూడా డిజాస్టర్. 2014లో మీరా జాస్మిన్ దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో కొన్నాళ్ళు నటనకు బ్రేక్ ఇచ్చింది.
మీరా జాస్మిన్ ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయట. మీరా జాస్మిన్ వ్యక్తిగత జీవితం గురించి స్పష్టమైన సమాచారం లేదు. భర్తతో పాటు దుబాయ్ వెళ్లిన మీరా జాస్మిన్ తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఉంటున్నారు. మరలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తనకు తగ్గ పాత్రలు చేస్తుంది. గత ఏడాది విమానం, క్వీన్ ఎలిజబెత్ చిత్రాలు చేసింది. అనసూయ, సముద్రఖని కీలక రోల్స్ చేసిన విమానం చిత్రంలో మీరా జాస్మిన్ తళుక్కున మెరిసింది.
కాగా మీరా జాస్మిన్ కి సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ ఇమేజ్ ఉంది. ఆమె కెరీర్ మొత్తం అలాంటి పాత్రలే చేసింది. ఎన్నడూ స్కిన్ షో చేసింది లేదు. అలాంటిది మీరా జాస్మిన్ పంథా మార్చింది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. నిండైన బట్టల్లో అల్లరి అమ్మాయి, క్యూట్ గర్ల్ రోల్స్ లో మీరా జాస్మిన్ ని చూసిన జనాలు ఇలా హాట్ గా చూడలేకున్నారు. మీరా జాస్మిన్ లో వచ్చిన ఈ మార్పు మైండ్ బ్లాక్ చేస్తుంది. మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.