https://oktelugu.com/

Jayam: జయం సినిమాలో నితిన్ కి డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

గత కొద్ది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ '90స్ ' అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అది సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం శివాజీ మంచి నటుడి గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 05:52 PM IST

    Jayam

    Follow us on

    Jayam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రం సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ తేజ.. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నువ్వు నేను సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో అప్పట్లో తేజ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఆ సమయంలోనే నితిన్ ను హీరోగా పెట్టి జయం అనే సినిమా చేశాడు.

    ఈ సినిమాలో నితిన్ డబ్బింగ్ చెబుతుంటే ఆయనకి కొంచెం నత్తి ఉండేది. దానివల్ల ఆయన సరిగ్గా డబ్బింగ్ చెప్పలేకపోయాడు. ఇక అప్పుడు ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ చిన్న చిన్న సినిమాల్లో నటుడిగా చేస్తున్న శివాజీతో నితిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పించాడు. ఆ వాయిస్ నితిన్ కి బాగా సెట్ అయింది. దానివల్లే నితిన్ తర్వాత చేసిన దిల్ సినిమాలో కూడా ఆయన చేతే డబ్బింగ్ చెప్పించడం విశేషం… అయితే శివాజీ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కొందరికి డబ్బింగ్ కూడా చెబుతూ వచ్చాడు. ఇక ఇండస్ట్రీ లో తనని తాను ప్రూవ్ చేసుకునేంతవరకు ప్రతి పని చేస్తూ వచ్చాడు.

    ఇక గత కొద్ది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ ’90స్ ‘ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అది సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం శివాజీ మంచి నటుడి గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయనే చెప్పాలి…

    ఇక ఇదిలా ఉంటే జయం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ ఆ తర్వాత రెండు మూడు సక్సెస్ లు సాధించి, ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో మరొక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టు దక్కడంతో ఆయన ఇండస్ట్రీలో మళ్లీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం నితిన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడనే చెప్పాలి…