https://oktelugu.com/

Meera Jasmine: ఆ మాజీ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తోన్న బోయపాటి !

Meera Jasmine: గోరింటాకు సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న నటి మీరా జాస్మిన్‌ తిరిగి టాలీవుడ్‍లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా. కాగా ఈ మాజీ హీరోయిన్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సిద్ధమైన మీరా జాస్మిన్‍కు.. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. కాగా హీరో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 4, 2022 / 03:10 PM IST
    Follow us on

    Meera Jasmine: గోరింటాకు సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న నటి మీరా జాస్మిన్‌ తిరిగి టాలీవుడ్‍లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా. కాగా ఈ మాజీ హీరోయిన్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సిద్ధమైన మీరా జాస్మిన్‍కు.. తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

    Meera Jasmine

    కాగా హీరో రామ్‌‍ తో.. బోయపాటి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరో అక్క పాత్రకు మీరాను సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి ఇప్పటికే మీరాకు కథ, పాత్రను వివరించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మీరా జాష్మిన్ మళ్ళీ అందాల ఆరబోతకు కూడా రెడీ అయ్యింది. నిజానికి గతంలో మీరా సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు.

    Also Read:  సీఎం త‌న తండ్రి కావ‌డం ఓ అదృష్ట‌మేః కేటీఆర్ ట్వీట్

    కానీ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచి.. హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తోంది. 39 ఏళ్ల వయసులో కూడా రీసెంట్ గా అదిరిపోయే ఫోటోషూట్ చేసింది మీరా జాస్మిన్. ఈ ఫొటోలు బాగా వైరల్‌గా అయ్యాయి కూడా. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు గ్లామర్ షోకు దిగడానికి కారణం ఏంటి అని అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

    Meera Jasmine

    అయితే, మీరా లేటు వయసులో హాట్ ఫోటో షూట్ లు చేయడానికి ప్రధాన కారణం.. మూవీల్లో అవకాశాల కోసమే. ఛాన్స్ ల కోసమే.. తాను ఫొటో షూట్ చేశాను అని మీరా కూడా తన సన్నిహతుల దగ్గర చెబుతుందట. కాగా 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత మూవీలకు బ్రేకిచ్చింది మీరా. ప్రస్తుతం మకల్‌ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలాగే తాజాగా బోయపాటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

    Also Read: గౌత‌మ్ స‌వాంగ్‌కు కీల‌క ప‌ద‌వి.. జ‌గ‌న్ అస‌లు వ్యూహం ఇదే..!

    Tags