Aadavallu Meeku Johaarlu Movie Review: నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బు, రాధిక శరత్ కుమార్ మరియు ఊర్వశి
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్
శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
ముప్పై ఏళ్లు దాటిపోతున్నా చిరంజీవి (శర్వానంద్)కి మాత్రం పెళ్లి కాదు. కళ్యాణమండపం నడుపుతూ పెళ్లి కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే, తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కారణంగా పెళ్లి కాకుండా మిగిలిపోతాడు. ఈ క్రమంలో ఆద్య(రష్మీక మందన్న)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో ట్రావెల్ చేస్తూ.. ఉంటాడు. అంతలో అతని క్యారె్టరైజేషన్ నచ్చి ఆద్యకి కూడా చిరు పై ఇష్టం కలుగుతుంది. కానీ పెళ్లి చేసుకోలేను అంటుంది. తన తల్లి వకుల(ఖుష్బూ)కి పెళ్లి అంటేనే ఇష్టం లేదు అని చెబుతుంది. అసలు ఆమెకు తన కూతురు పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు ? ఆధ్య తల్లి మనసు మార్చడానికి చిరంజీవి ఏమి చేస్తాడు ? చివరకు చిరు – ఆద్య ఎలా కలుస్తారు ? అనేది మిగిలన కథ.
విశ్లేషణ :
పెళ్లికి సంబంధించిన మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు కిషోర్, తన అద్భుతమైన టేకింగ్ తో, వెరీ ఎమోషనల్ విజన్ తో ఈ సినిమాని ఎమోషనల్ లవ్ డ్రామాగా చాలా బాగా మలిచాడు. హీరో క్యారక్టరైజేషన్ దగ్గర నుంచి హావభావాల వరకు, అలాగే హీరోయిన్ లుక్ అండ్ క్యారెక్టర్ లోని షేడ్స్ వరకు దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు సినిమా స్థాయిని నాలుగింతలు పెంచింది.
ఏ సినిమాలోనైనా కథను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే ఆ సీన్స్ ఉపయోగపడతాయి. సహజంగా అలాంటి సీన్స్ లో ఇంట్రెస్ట్ ఉండదు. కానీ, ఆ సీన్స్ ను చాలా ఎంటర్ టైన్ గా చెప్పాలంటే ఆ దర్శకుడికి గొప్ప విజువల్ సెన్స్ ఉండాలి. ఆ విసయంలో కిషోర్ ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సాధారణ సన్నివేశాలను కూడా చాలా చక్కగా తెరక్కించాడు. అతని విజువల్ సెన్స్ చాలా బాగుంది.
నిజానికి కథలో కొన్ని లోపాలు ఉన్నాయి. సినిమా బాగా స్లోగా ఉంటుంది. సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో మొత్తానికి ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
Also Read: మోహన్ బాబు, విష్ణుపై మెగా ఫ్యామిలీ ప్రతీకారం.. ఇండస్ట్రీ రెండుగా చీలుతుందా?
హైలెట్ పాయింట్స్ ;
దర్శకుడు కిషోర్ తిరుమల టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్,
శర్వానంద్ నటన,
రష్మీక గ్లామర్,
ఎమోషనల్ సీన్స్,
సాంకేతిక వర్గం పనితీరు.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
లవ్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
`ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో స్వచ్ఛమైన కుటుంబ బంధాలు అక్కడక్కడ కనిపించినా… ఇక అంతకుమించి ఇంట్రెస్టింగ్ కహానీలు ఏమీ లేవు. మొత్తమ్మీద ఈ సినిమా తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అయితే కాదు.
రేటింగ్ : 2.5 /5
Also Read: ప్రముఖ హీరోయిన్ పెళ్లికి సిద్ధం