Mahesh Babu Sarkaru Vaari Paata: యాక్షన్ మోడ్ లో ఉన్న ‘సర్కారు వారి పాట’

Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మహేష్‌ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఈ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో కీర్తీ సురేష్ తో పాటు కమెడియన్ అలీ కూడా పాల్గొన్నారు. పరశురామ్ […]

Written By: Sekhar Katiki, Updated On : March 27, 2022 10:32 am
Follow us on

Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మహేష్‌ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఈ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో కీర్తీ సురేష్ తో పాటు కమెడియన్ అలీ కూడా పాల్గొన్నారు.

Mahesh Babu Sarkaru Vaari Paata

పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఈ ఏడాది మే 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. కాగా ఇప్పటి వరకూ 20 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా, 923 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది.

Also Read:  ఫ్లిప్ కార్ట్ ద్వారా పాత ఫోన్ ను సులువుగా అమ్మే అవకాశం.. ఎలా అంటే?

కాగా మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పాట సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కావడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా ఈ పాట మాత్రం బాగా హిట్ అయ్యింది.

Mahesh Babu Sarkaru Vaari Paata

ఈ సాంగ్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేస్తారట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

Tags