Site icon OkTelugu

Tollywood: పద్దతిగా కనిపిస్తున్న ఈ భామ టాలీవుడ్ హాట్ బ్యూటీ… ఎవరో తెలిశాక అవునా! అని ఆశ్చర్యపోతారు!

Interesting Facts about Aditi Rao Hydari

Interesting Facts about Aditi Rao Hydari

Tollywood: ఈ ఫోటోలో ఓ అమ్మాయి చీర కట్టులో హోమ్లీగా కనిపిస్తుంది. చూడగానే కట్టి పడేసే చిరునవ్వుతో మనసులు దోచేస్తుంది. నిజానికి ఈమె మనందరికీ తెలిసిన హీరోయిన్. కానీ ఆమె ఒకప్పటి లుక్ చూసి కనిపెట్టడం కష్టంగా ఉంది. అంతగా మారిపోయింది ఈ హీరోయిన్. ఇంతకీ మీరు గెస్ చేశారా?… సదరు హీరోయిన్ ఎవరో కాదు అదితి రావ్ హైదరి. హైదరాబాద్ కి చెందిన ఈ భామ  బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేసింది.

అదితిరావ్ హైదరి 2006లో విడుదలైన ప్రజాపతి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. అనంతరం శృంగారం టైటిల్ తో ఒక తమిళ్ మూవీ చేసింది. తర్వాత వరుసగా హిందీ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో అదితిరావు హైదరి మొదటి చిత్రం సమ్మోహనం. సుధీర్ బాబు హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించాడు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అంతరిక్షం మూవీలో వరుణ్ తేజ్ కి జంటగా నటించింది. లావణ్య త్రిపాఠి మరొక హీరోయిన్ గా చేసింది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. నాని-సుధీర్ బాబు కాంబోలో తెరకెక్కిన వి చిత్రంలో అదితిరావ్ హైదరి నటించింది. ఆ చిత్రంలో అదితిరావ్ హైదరి పాత్రకు పెద్దగా నిడివి ఉండదు.

ఇక తెలుగులో అదితి రావ్ హైదరి నటించిన చివరి చిత్రం సముద్రం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్ర దర్శకుడు. శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ చిత్ర హీరో సిద్ధార్థ్ తో ప్రస్తుతం సహజీవనం చేస్తుంది అదిరిరావ్ హైదరి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. పెళ్లి అయ్యిందని పుకార్లు రాగా… కేవలం ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గాంధీ టాక్స్, లయనెస్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేస్తుంది.

Exit mobile version