Mauli: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల డామినేషన్ ఎక్కువైపోతుంది అంటూ చాలామంది చాలా రకాల కథనాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక కొత్తగా వచ్చే హీరోలకు పెద్దగా అవకాశాలు రావని వాళ్లు సైతం కొన్ని కల్పిత కథలను చెబుతుంటారు. కానీ కంటెంట్ ను నమ్ముకొని ముందుకు వెళితే ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన హీరోలు సైతం ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇండస్ట్రీ వచ్చిన కొత్త హీరోలు ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేసి ప్లాపులను మూటగట్టుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక సీనియర్ హీరోలు తమను ఇక్కడ ఉండనివ్వడం లేదంటూ కొన్ని కల్పిత కథలను చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే నాని లాంటి హీరో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారిపోయాడు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఇక ఇప్పుడు 90స్ బయోపిక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మౌళి సైతం నాని బాటలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. లిటిల్ హార్ట్స్ సినిమాతో రీసెంట్ గా ఒక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే లిటిల్ హార్ట్స్ సినిమాకి ముందు తను 17 కథలను విన్నానని కానీ ఆ కథలేమి తనకు పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశానని చెప్పాడు.
లిటిల్ హార్ట్స్ సినిమాలో కథ బాగుండటమే కాకుండా ఒక జన్యూన్ కామెడీ ఉందని అది చూసి చాలా రోజులు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాకి కమిట్ అయ్యానని చెప్పాడు. ఇక ఈ మూవీ తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని తనకి ముందే తెలుసని రీసెంట్ గా ఒక ఈవెంట్లో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా మౌళి మొదట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
మరి ఫ్యూచర్లో కూడా తను మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని ముందుకు సాగితే మాత్రం హీరోగా రాణిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కథల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వీలైనంత తొందరగా స్టార్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం…