https://oktelugu.com/

Mathu Vadalara 2 in OTT : విడుదలైన రెండవ రోజే ఓటీటీ లోకి ‘మత్తు వదలరా 2 ‘..మేకర్స్ కి ఇది కోలుకోలేని షాక్!

కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన 'మత్తు వదలరా' చిత్రం 2019 వ సంవత్సరం లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 14, 2024 / 03:41 PM IST

    Mathu Vadalara 2

    Follow us on

    Mathu Vadalara 2 in OTT :  ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సీక్వెల్స్ జోరు ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. హీరో తో సంబంధం లేకుండా, సీక్వెల్స్ ని పర్ఫెక్ట్ గా చిత్రీకరించబడిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన ‘స్త్రీ 2 ‘ అందుకు ఉదాహరణ. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ వెయ్యి కోట్ల రూపాయిల దిశగా అడుగులు వేస్తుంది. సీక్వెల్స్ క్లిక్ అవుతున్నాయి కదా అని ఇష్టమొచ్చినట్టు తీస్తే ఆడియన్స్ అంగీకరించడం లేదు. అందుకు మరో ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ చిత్రం.

    ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యం లో నిన్న ‘మత్తు వదలరా 2 ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘మత్తు వదలరా’ చిత్రం 2019 వ సంవత్సరం లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘మత్తు వదలరా 2 ‘ కి విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, ప్రొమోషన్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. అలా భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కమెడియన్ సత్య ని చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తేసారు. భవిష్యత్తులో బ్రహ్మానందం సునీల్ రేంజ్ కమెడియన్ గా సత్య మారుతాడని, సినిమాని తన భుజాల మీద మోసి సూపర్ హిట్ ని చేసాడని, ఇలా పలు రకాల రివ్యూస్ సోషల్ మీడియా లో వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా 1 మిలియన్ మార్కు వైపు అడుగులు వేస్తుంది. కేవలం ప్రీమియర్స్ + మొదటి రోజు నుండి ఈ సినిమా దాదాపుగా 3 లక్షల డాలర్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. మేకర్స్ తో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 10 వ తేదీ లోపు స్ట్రీమింగ్ చేయాలని. సినిమా రన్నింగ్ టైం లోనే ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో మేకర్స్ కాస్త అసహనం ని వ్యక్తం చేసారు.