https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నిఖిల్ వెనుక తిరగడం తప్ప..నీ గేమ్ అసలు కనిపించట్లేదు అంటూ యష్మీ పై చిరాకుపడిన తండ్రి!

ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్స్ ఎంతో కీలకం. ఒక కంటెస్టెంట్ తన ఆట తీరుని పూర్తి మార్చుకునే సమయం ఇది

Written By: , Updated On : November 14, 2024 / 08:29 AM IST
Yashmi's father is annoyed by saying that except Nikhil's back..your game is not real!

Yashmi's father is annoyed by saying that except Nikhil's back..your game is not real!

Follow us on

Bigg Boss Telugu 8 :  ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్స్ ఎంతో కీలకం. ఒక కంటెస్టెంట్ తన ఆట తీరుని పూర్తి మార్చుకునే సమయం ఇది. గత సీజన్ లో కూడా ఫ్యామిలీ వీక్ తర్వాత కంటెస్టెంట్స్ లో అనూహ్యమైన మార్పులు రావడం మనమంతా చూసాము. ముఖ్యంగా ప్రియాంకకి అతని కాబోయే భర్త హౌస్ లోపలకు వచ్చి గ్రూప్ గేమ్స్ గురించి బయట ఆమె ఎంత నెగటివ్ అవుతుందో చెప్పి వెళ్తాడు. ఆ పక్క రోజు నుండి ఆమె తనలో అనూహ్యమైన మార్పులను చూపించింది. ఎంతలా అంటే తన స్నేహితులను కూడా నామినేట్ చేసే రేంజ్ లో అన్నమాట. ఈ సీజన్ లో యష్మీ కి కూడా ఆమె తండ్రి అలాంటి హింట్స్ ఇచ్చి వెళ్ళాడు. నిన్నటి ఎపిసోడ్ ప్రారంభం లోనే యష్మీ తండ్రి హౌస్ లోపలకు వస్తాడు. చాలా కాలం తర్వాత తన తండ్రిని చూసేలోపు యష్మీ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఆయన హౌస్ మేట్స్ అందరితో చాలా స్నేహంగా మాట్లాడుతాడు.

నిఖిల్ వాళ్ళ అమ్మ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ బాగా నచ్చిన వ్యక్తిగా యష్మీ తండ్రి నిలిచాడు. అంత స్నేహంగా, మర్యాదగా ఆయన హౌస్ మేట్స్ అందరితో ముచ్చటించాడు. ఇదంతా అయ్యాక గార్డెన్ ప్రాంతం వద్ద యష్మీ తో ఏకాంతంగా మాట్లాడుతూ ఆమె ఆట తీరుని మార్చుకునేందుకు కావాల్సిన సూచనలు, బయట జనాలు ఏమి అనుకుంటున్నారు అనేది స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. మొదటి 5 వారాలు నువ్వు నీ సొంత గేమ్ ఆడావు, కానీ గత రెండు వారాల నుండి నీ ద్రుష్టి మొత్తం మారిపోయింది. నీ ఆట అసలు కనిపించడం లేదు అని చెప్తాడు. అప్పుడు యష్మీ లేదు నాన్న, బాగానే ఆడుతున్నాను అని అంటుంది. అసలు లేదు, నీ స్నేహితులు కూడా నీకు ఇది చెప్పమని చెప్పారు, బయట నువ్వు చాలా నెగటివ్ అయిపోతున్నావు అని అంటాడు యష్మీ తండ్రి.

ఇదంతా పక్కన పెడితే యష్మీ నామినేషన్స్ గురించి ఎక్కువగా తన గ్యాంగ్ తో చర్చలు జరపడం అందరికీ తెలిసిందే. హౌస్ లో ఈమె రేంజ్ లో నామినేషన్స్ గురించి ఎవ్వరూ చర్చించలేదు. దీని గురించి ఆమె తండ్రి వార్నింగ్ ఇస్తాడు. నామినేషన్స్ గురించి ఎందుకు నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నావు. నీ సొంతం గా, నీ అభిప్రాయాలతో నామినేషన్స్ వేసుకో, బయట నిన్ను ఈ విషయం లో ప్రేక్షకులు తిడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా కేవలం ఒకరి చుట్టూనే తిరగకు, అందరితో సమానంగా మాట్లాడు అని అంటాడు. ఇవన్నీ విన్న తర్వాత యష్మీ మాట్లాడుతూ ‘నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది. ఇక నుండి అలాగే ఉంటాను’ అని చెప్పుకొచ్చింది యష్మీ. తన తండ్రి వెళ్లిన తర్వాత షాకింగ్ సంఘటన ఏమి జరిగిందంటే, యష్మీ వైల్డ్ కార్డ్స్ ఉన్న రూమ్ లోకి వెళ్లి కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడింది. ఇన్ని రోజులు ఎప్పుడూ ఈ పని చేయని ఆమె, తన తండ్రి ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధమైంది అని ఈ సంఘటన చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది.