Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2 ‘ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..లాభాల్లో సెన్సేషనల్ రికార్డు..ఎవరికీ సాధ్యం కాదు!

సోషల్ మీడియా లో కూడా అందరూ సత్య కామెడీ టైమింగ్ గురించే ప్రధానంగా మాట్లాడుకున్నారు. పాపం హీరో సింహా ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ ని దక్కించుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రన్ ని ముగించుకుంది. ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాము.

Written By: Vicky, Updated On : October 1, 2024 5:21 pm

Mathu Vadalara 2  Collections

Follow us on

Mathu Vadalara 2: ఈ ఏడాది చిన్న సినిమాల హవా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో కి ఎదురుగా నిలబడి ‘హనుమాన్’ లాంటి చిన్న సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా, అత్యధిక వసూళ్లను కూడా రాబట్టింది. ఆ తర్వాత ‘కల్కి’, ‘సరిపోదా శనివారం’ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు బాగా ఆడాయి కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అలాంటి సమయంలో చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ ని ఆడుకున్నాయి. అలా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. 2019 వ సంవత్సరం లో భారీ హిట్ గా నిచ్చిన ‘మత్తు వదలరా’ కి సీక్వెల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ రితేష్ రానా. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యి, ఈ స్థాయి వసూళ్లు రావడానికి ప్రధాన కారణం సత్య అద్భుతమైన కామెడీ టైమింగ్ వల్లే అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.

సోషల్ మీడియా లో కూడా అందరూ సత్య కామెడీ టైమింగ్ గురించే ప్రధానంగా మాట్లాడుకున్నారు. పాపం హీరో సింహా ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ ని దక్కించుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రన్ ని ముగించుకుంది. ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాము. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ‘దేవర’ చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో ఆడుతున్నప్పటికీ కూడా ఈ సినిమా ఇంకా ఈ ప్రాంతం లో నడుస్తూనే ఉందంటే ఎంత మంచి రన్ అనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలంగాణ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి కోటి 30 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 4 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కేవలం 2 కోట్ల రూపాయిలు మాత్రమే ఖర్చు అయ్యింది, కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 8 కోట్ల రూపాయలకు జరిగింది, క్లోసింగ్ వసూళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కి రెండింతలు వసూలు చేసింది. ఈ స్థాయి లాభాలు ఇటీవల కాలం లో పెద్ద సినిమాలకు కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.