https://oktelugu.com/

Mathu Vadalara 2 Review : ‘మత్తు వదలరా 2’ ఫుల్ మూవీ రివ్యూ..

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రితేష్ రానా మొదటి నుంచి కూడా చాలా మంచి స్క్రీన్ ప్లే ని రాసుకొని సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన చాలా వరకు సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఆయన రాసుకున్న కామెడీ సీన్లు కూడా అద్భుతంగా సెట్ అయ్యాయి.

Written By:
  • Gopi
  • , Updated On : September 13, 2024 / 09:53 AM IST

    Mathu Vadalara 2 Review

    Follow us on

    Mathu Vadalara 2 Review : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథంశాలతో దర్శకులు విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు రితేష్ రానా నాలుగు సంవత్సరాల క్రితం చేసిన ‘మత్తు వదలరా’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీ సింహ, సత్య ఇద్దరు కలిసి మొదటి పార్ట్ లో ఎలా అయితే దొంగతనాలు చేస్తూ వచ్చారో, సెకండ్ పార్ట్ కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అని కోరుకుంటారు. ఇక అందులో భాగంగానే వాళ్లు చేసిన దొంగతనం సక్సెస్ ఫుల్ గా సాగిందా లేదా ఇక ఫస్ట్ పార్ట్ కి, సెకండ్ పార్ట్ కి మధ్య ఇంటర్ లింక్ ఏంటి అనే విషయాలను మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రితేష్ రానా మొదటి నుంచి కూడా చాలా మంచి స్క్రీన్ ప్లే ని రాసుకొని సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన చాలా వరకు సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఆయన రాసుకున్న కామెడీ సీన్లు కూడా అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇక మొదట్లో కొంచెం డల్ గా ఓపెన్ అయిన ఆ తర్వాత మాత్రం ఈ సినిమా ఎక్కడ ఆగకుండా దూసుకుపోయింది. ముఖ్యంగా సత్య మీద రాసిన కామెడీ సీన్లు అయితే సినిమాలో నవ్వులు పూయిస్తున్నాయనే చెప్పాలి. ఇక దర్శకుడు ఇంతకుముందు చేసిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు గా కూడా తెలుస్తుంది.

    ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కామెడీ కి పెద్దపీట వేస్తూ వచ్చిన దర్శకుడు ఈ సినిమా మధ్యలో కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు.క్లైమాక్స్లో మాత్రం సినిమాని చాలా హై రేంజ్ లోకి తీసుకు వచ్చారు. శ్రీ సింహ మాత్రం ఈ సినిమాలో చాలా అద్భుతంగా సెట్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ను ఎక్కడ డివియేట్ అవ్వకుండా చాలా క్లియర్ కట్ గా మొదటి నుంచి చివరి వరకు చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అందులో దర్శకుడు కొంత వరకు తడబడ్డప్పటికీ ఫైనల్ గా మాత్రం తన అనుకున్న పాయింట్ ని జనాలకు రీచ్ అయ్యే విధంగా అయితే చేశాడు…ఇక ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా కీలకపాత్ర వహించిందన చెప్పాలి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే సెకండ్ హాఫ్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడమే కాకుండా కొన్ని ఎమోషన్ సీన్స్ లో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా సెట్ అయింది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీ సింహ ఈ సినిమా సినిమాకి చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్నాడు. నిజానికి కీరవాణి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం తనకంటూ ఒక సపరేట్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో కూడా ఒక మంచి అవుట్ ఫుట్ ని ఇచ్చే విధంగా నటనని కనబరిచాడు. ఇక సత్య గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఆయన చేసిన పాత్ర ఇంకెవరు చేసినా కూడా సెట్ అయ్యేది కాదు.

    అంతటి ఒక ఎక్స్ట్రార్డినరీ కామెడీ క్యారెక్టర్ ని ప్లే చేస్తూనే తాను చెప్పిన డైలాగులకు జనాలు విజిల్స్ వేస్తున్నారు. రాబోయే రోజుల్లో టాప్ కామెడీయన్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించింది. అలాగే వెన్నెల కిషోర్ తనదైన రీతిలో నటించి డిసెంట్ పర్ఫామెన్స్ ను అయితే ఇచ్చాడు. ఇక రోహిణి పాత్ర కూడా ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ మాత్రం చాలా బాగా సెట్ అయింది. ఇక దర్శకుడు ఏ టెంపో లో అయితే సినిమాని ముందుకు తీసుకెళ్లాడో ఆ టెంపొని మ్యాచ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది… ఇక ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి మ్యూజిక్ ని అందిస్తూ కీరవాణి పేరు నిలబెడుతున్నాడు. ఇక సినిమాటోగ్రాఫర్ అయిన సురేష్ సారంగం అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ ని కలిగించే విధంగా ఉండటం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది…ఇక ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ చేసిన ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా చక్కగా కుదిరింది. అనవసరమైన సీనులను ఉంచకుండా చాలా షార్ప్ ఎడిటింగ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు…

    ప్లస్ పాయింట్స్

    కథ
    సత్య కామెడీ
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    స్టార్టింగ్ కొంచెం బోర్ గా అనిపించింది.
    హీరో క్యారెక్టరైజేషన్ ను ఇంకాస్త డెప్త్ గా చూపిస్తే బాగుండేది…

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్
    థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమాను చూడవచ్చు