Master Bharath: టాలీవుడ్‌లో చాలామంది బాలనటులుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోలుగా కూడా మారారు. అయితే ఒక్క నటుడు మాత్రం.. బాల నటుడిగానే కామెడీని ఓ రేంజ్‌లో పండించి.. అందరికీ గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఇప్పుడు పెద్దయ్యాక కూడా.. సినిమాల్లో బాగా బిజీగా ఉంటున్నాడు. అతనే మాస్టర్ భరత్. ఈయన గురించి అప్పటి తరానికి, ఇప్పటి తరానికి బాగా తెలుసు.

ఈయన రెడీ మూవీలో చిట్టినాయుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి.. నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అయితే చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఆయన.. ఇప్పుడు పెద్దయ్యాక స్లిమ్ముగా మారి.. హీరోగా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు.
Also Read: Bigg Boss OTT Telugu Bindu Madhavi: ఆమె ‘టైటిల్ విన్నర్’.. బిగ్ బాస్ విశ్లేషకుల రివ్యూ ఇది
ముఖ్యంగా ఆయన తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన బాధలను వివరించారు. తాను చిన్నప్పుడు బొద్దుగా ఉండటంతో.. బరువు తగ్గించుకోవడానికి పెద్ద వాడిగా మారే వయసులో చాలా కష్టపడ్డట్టు తెలిపారు. జిమ్ లో ఎక్కువగా గడిపేవాడినని, విపరీతంగా కఠిన వ్యాయామాలు చేసినట్టు తెలిపారు. ఇలా చేస్తున్న సమయంలోనే ఒక రాడ్ స్ప్రింగ్ తన కంటికి తగిలి పెద్ద ప్రమాదం జరిగిందన్నారు.

ఆ ప్రమాదంలో తన కుడి కన్ను చూపు కోల్పోయానని చెప్పి బాధపడ్డారు. ఆ బాధను కొన్నేళ్లు భరించానని, చికిత్స తీసుకుని ఇప్పుడు బాగానే ఉంటున్నానని వెల్లడించారు. ఇక తన కాలేజీ రోజుల్లో తనకు అమ్మాయిల పాలోయింగ్ ఎక్కువ అని చెప్పుకొచ్చారు. తనకు ఎంతో మంది అమ్మాయిలు ప్రపోస్ చేసినట్టు వివరించారు. అయినా కూడా తాను ఎప్పటికీ తల్లి మాట జవదాటని బిడ్డనే అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు వస్తున్నాయని, మంచి కథ కోసం ఎదరు చూస్తున్నట్టు తెలిపారు.
Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?