https://oktelugu.com/

Prabhas Salaar Movie Budget: భారీగా పెరిగిన ‘సలార్’ బడ్జెట్.. వర్కౌట్ అవుతుందా ?

Prabhas Salaar Movie Budget: కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించే హాట్ టాపిక్. ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ మొదట అనుకున్నదాని కంటే భారీగా పెరిగిపోయింది. సుమారు రూ.200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారని టాక్. ఇందులో పెద్ద మొత్తంలో ప్రభాస్‌కు రెమ్యునరేషన్, భారీ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 22, 2022 / 01:00 PM IST
    Follow us on

    Prabhas Salaar Movie Budget: కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించే హాట్ టాపిక్. ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ మొదట అనుకున్నదాని కంటే భారీగా పెరిగిపోయింది. సుమారు రూ.200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారని టాక్.

    Prabhas Salaar

    ఇందులో పెద్ద మొత్తంలో ప్రభాస్‌కు రెమ్యునరేషన్, భారీ సెట్లు, యాక్షన్ సన్నివేశాల కోసం వెచ్చిస్తునట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కాబట్టి.. బడ్జెట్ పెరిగినా తమకు ఇబ్బంది ఏమి లేదు అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరోపక్క ప్రశాంత్ నీల్ ఇంకా బడ్జెట్ పెంచే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా భారీ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.. భారీ ఫైట్ సీక్వెన్సెస్ ను పెడుతున్నాడు.

    Also Read:  జ‌బ‌ర్ద‌స్త్‌లో నిజ‌మైన ప్రేమికులు.. ఆ లేడీ క‌మెడియ‌న్‌తో ల‌వ్‌లో ప‌డ్డ‌ రాకేశ్

    ప్రస్తుతానికి అయితే, ‘సలార్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ నుంచి గత వారం ఓ వీడియో లీక్‌ అయి వైరల్‌‌ అయిన సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్ ను చాలా జాగ్రత్తగా చేసున్నారు. బయట వారిని ఎవరిని రానీయడం లేదు. ఇక ఇన్నాళ్లు ‘రాధే శ్యామ్’, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ తో తీరిక లేకుండా గడిపిన ప్రభాస్, ప్రస్తుతం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.

    అన్నట్టు ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందని.. ఈ షెడ్యూల్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయ్యాక, సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారట.

    Jagapathi Babu as Rajamanaar

     

    ఇప్పటికే అక్కడ భారీగా సెట్స్ కూడా వేశారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read:  మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

    Tags