Raviteja: సినిమా పరిశ్రమ లో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోకి సినిమా ఛాన్సులు తక్కువగానే ఉంటాయి అని చెప్పాలి అదే ఒక్క సినిమా హిట్టయితే వరుసగా ప్రాజెక్టులతో బిజీ అయిపోతారు హీరోలు అయితే అదే బాటలో దూసుకుపోతున్నారు మాస్ రాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “క్రాక్” సినిమా సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా వరుస సినిమాలతో అభిమానులను అలరించనున్నారు.

ఖిలాడీ,రామారావు ఆన్ డ్యూటీ ,ధమాకా,టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాలలో బిజీగా ఉన్నారు మాస్ రాజా అయితే ఇటీవలే డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు మాస్ రాజా రవితేజ. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్ దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ దశముఖ రావణాసుర గా కనిపిస్తారు ఒక లాయర్ లుక్ లో సీరియస్ గా చూస్తూ చేతిలో సుత్తి పట్టుకొని కూర్చుంటాడు రవితేజ. బ్యాక్ గ్రౌండ్ లో రక్తం, గన్స్, భయంకర లుక్ తో మాస్ రాజా కనిపించడంతో ఈ మూవీపై అభిమానుల లో భారీ అంచనాల పెరుగుతున్నాయి.రావణాసుడు కి ఉన్న పది షేడ్స్ ని రవితేజ లో అదే పది వేరియేషన్స్ ఏ యాంగిల్స్ లో చూపించనున్నారు సుధీర్ వర్మ అనేది చూడాలి.