https://oktelugu.com/

టీఎంసీలో 126 ఉద్యోగ ఖాళీలు.. పరీక్ష లేకుండా భారీ వేతనంతో?

టాటా మెమోరియల్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 126 ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎండీ, డీఎన్‌బీ, బీటీ, జనరల్‌ నర్సింగ్‌ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 29వ తేదీ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2021 7:30 pm
    Follow us on

    టాటా మెమోరియల్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 126 ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎండీ, డీఎన్‌బీ, బీటీ, జనరల్‌ నర్సింగ్‌ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    ఈ నెల 29వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రాతపరీక్ష లేకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పంజాబ్, ముంబైలోని రీజినల్ సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. https://tmc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    మొత్తం 126 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 12 ఉద్యోగ ఖాళీలు, రేడియాలజీ అసిస్టెంట్‌ ఒక ఉద్యోగ ఖాళీ, నర్స్ 102 ఉద్యోగ ఖాళీలు, ఐటీ హెడ్ ఒక ఉద్యోగ ఖాళీ, డిస్పెన్సరీ ఇన్‌చార్జ్‌ ఒక ఉద్యోగ ఖాళీ, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ 2 ఉద్యోగ ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ 1 ఉద్యోగ ఖాళీ, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) ఒక ఉద్యోగ ఖాళీ, అసిస్టెంట్ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎండీ, డీఎన్‌బీ, బీఈ, బీటెక్‌, జనరల్‌ నర్సింగ్‌, ఆంకాలజీ నర్సింగ్‌ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. జనరల్ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.