Success: ఇటీవల కొందరు చెబుతున్న విషయం ఏంటంటే.. తమ ఆఫీసులో ఎప్పటికీ ఇబ్బందులు.. ఇంట్లో కుటుంబ సమస్యలు.. పిల్లలు తమ మాట వినకపోవడం.. చుట్టుపక్కల వారు అభివృద్ధి అవుతున్నారు.. కానీ తాము మాత్రం ఎదగడం లేదు అని అంటున్నారు. అయితే ఇలా చెప్పేవారు ఒకసారి తమ జీవితంలో ప్రతిరోజు ఏం చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొన్ని అలవాట్లను, పద్ధతులను మార్చుకోకుండా ఇలా పై విషయాలపై బాధపడడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరి జీవితం తాము చేసే పనులు, ఏర్పరచుకున్న అలవాట్ల ద్వారానే బాగుండడం.. లేకపోవడం అనేది జరుగుతుంది. అసలు పై సమస్యలు ఎలా వస్తాయి? ఈ సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలి?
పై సమస్యలు వచ్చే వ్యక్తి ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటాడంటే.. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కనీసం గంట పాటు మొబైల్ చూడడం.. రాత్రి 11 లేదా 12 గంటల వరకు మొబైల్ తోనే కాలక్షేపం చేయడం.. ఉదయం ఎనిమి నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్ర లేవడం జరుగుతుంది. ఇలా లేచేసరికి తమ ఇంట్లో పిల్లల హడావిడి ఎక్కువగా ఉంటుంది. తమ ఇంట్లో ఇల్లాలు అన్ని పనులు ఒకేసారి చేయలేక సమయానికి తమ పిల్లలను స్కూలుకు పంపే ఆస్కారం ఉండదు. దీంతో ప్రతిరోజు బస్సు మిస్సై పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇలా తొమ్మిది గంటలకు లేచిన వ్యక్తి 10 గంటలకు ఆఫీసుకు వెళ్తాడు. అక్కడ పెండింగ్ ఫైల్స్ పేరుకు పోతాయి. తోటి ఉద్యోగులతో కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. అప్పటికే ఆలస్యంగా నిద్ర లేవడంతో మనసు భారంగా ఉండడంతో.. ఏ పని చేయలేక పోతాడు. క్రమంగా పై సమస్యలు ఒక్కొక్కటి మొదలవుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి ఉండే అలవాట్లు తమ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ అలవాట్లు ఉండడం వల్లే జీవితంలో ఎదగకపోవడం.. సమస్యలు రావడం బండి ఉంటాయి
అయితే ఈ సమస్యలు తొలగిపోవాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. కనీసం ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి నిద్ర లేవడమే కాకుండా తమ పిల్లలను కూడా ఎర్లీ అవర్స్ లో నిద్ర లేపుతాడు. ఫలితంగా వారు ఇన్ టైం లోనే రెడీ అయిపోతారు. అలాగే ఈ సమయంలో తమ సహచరిని లేదా భార్యకు సహకరిస్తూ కొన్ని పనులను చేయగలుగుతాడు. ఇలా చేయడం వల్ల ఇల్లాలుపై కూడా భారం పడకుండా పనులు తొందరగా పూర్తయి బస్సు వచ్చేవరకు పిల్లల్ని రెడీ చేస్తారు. పిల్లలు ఏం టైంలో స్కూలుకు వెళ్లడం వల్ల వారిపై టీచర్లకు సైతం మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం వల్ల మనసు ఉత్తేజంతో ఉంటుంది. దీంతో వ్యక్తి కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఉత్సాహంగా పనిచేయగలుగుతాడు. తోటి వారితో సక్రమంగా పనులు చేస్తూ.. ప్రాజెక్టులను పూర్తి చేస్తాడు. దీంతో పదోన్నతి పెరిగే జీవితంలో అత్యంత స్థాయికి వెళ్తాడు. అంటే ఒక వ్యక్తికి ఉండే అలవాట్లే తన జీవితాన్ని మార్చేస్తాయని ఈ విషయాలు తెలుపుతుంటాయి.