Mass Jathara: తమ స్వశక్తితో ఇండస్ట్రీ కి వచ్చి చిన్న చిన్న అవకాశాలను వాడుకొని నటులుగా మారి సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉండగా, అతని తర్వాత స్థానంలో రవితేజ ఉంటాడు. వీళ్లు ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. భారీ సక్సెస్ లను సాధించారు స్టార్ హీరోలుగా మారారు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను చేస్తున్నప్పటికి ఆయనకు సక్సెసులు మాత్రం రావడం లేదు. ఒకప్పుడు రవితేజ నుంచి సినిమా వస్తోంది అంటే అది మినిమం గ్యారంటీ సినిమా గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన రొటీన్ రొట్ట సినిమాలు చేస్తుండటం వల్ల ఆయనకు ఎలాంటి గుర్తింపైతే రావడం లేదు. తనతో చాలామంది దర్శకులు సినిమాలు చేయడం మానేశారు.ఒకప్పుడు రవితేజ తో స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు.
కానీ ఇప్పుడు మాత్రం కొత్త డైరెక్టర్లు, ఫ్లాపుల్లో ఉన్న దర్శకులు మాత్రమే రవితేజతో సినిమాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన మార్కెట్ రోజు రోజుకి డౌన్ అయిపోతోంది. ఇక ఇప్పుడు మాస్ జాతర పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ జాతర సినిమాలో పెద్దగా ఎమోషన్స్ లేవని ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక రవితేజ నుంచి మరో ప్లాప్ సినిమా రాబోతోంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా బానే ఉంటుంది. ఒకసారి చూడొచ్చు అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ రావాలంటే మాత్రం మరొక 24 గంటల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఇకమీదటైనా రవితేజ ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తాడా లేదంటే రొటీన్ రొట్టా సినిమాల వైపే తన అడుగులు వేస్తాడా? అనేది… ఇక ఇప్పటికే మరో రెండు మూడు సినిమాలకు రవితేజ కమిట్ అయ్యాడు. ఇక ఆ సినిమాలు కూడా ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది…