Mass Jatara : రవితేజ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉంది. ధమాకా అనంతరం ఆయన నటించిన ఒక్క సినిమా కూడా హిట్ స్టేటస్ అందుకోలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్ వరుసగా పరాజయం పాలయ్యాయి. మిస్టర్ బచ్చన్ అయితే రవితేజ కెరీర్లో వరస్ట్ మూవీ అని ప్రేక్షకులు తేల్చేశారు. రవితేజ అభిమానులు సైతం పెదవి విరిచారు. దర్శకుడు హరీష్ శంకర్ హడావుడిగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు. మిస్టర్ బచ్చన్ లోని ఓ సాంగ్ సైతం వివాదాస్పదం అయ్యింది. హీరోయిన్ చీర కుచ్చెళ్ళలో రవితేజ వేసిన ఓ స్టెప్ అసభ్యకరంగా ఉందని సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఈ వివాదంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ స్టెప్ నాకు కూడా నచ్చలేదు. శేఖర్ మాస్టర్ తో అదే ఫస్ట్ డే. మొదటిరోజే అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటే, మాస్టర్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడని చెప్పలేదని, హరీష్ అన్నారు. రవితేజ అభిమానులు మాత్రం ఆయన ఒక సాలిడ్ హిట్ ఇచ్చి తమ దాహం తీర్చాలని కోరుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు తో మాస్ జాతర చేస్తున్నాడు రవితేజ. రవితేజ కెరీర్లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ. రవితేజ 75వ చిత్రంగా మాస్ జాతర తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ కమ్ బ్యాక్ కావడం ఖాయం అంటున్నారు.
Also Read : అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న రవితేజ!
కాగా ఈ మూవీ విడుదల ఆలస్యం అవుతుంది. సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేయాలని మొదట భావించారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం మాస్ జాతర ఆగస్టు 27న థియేటర్స్ లోకి రానుందట. ఈ మేరకు పరిశ్రమ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే నెలలో వార్ 2, కూలీ వంటి బడా చిత్రాలు థియేటర్స్ లోకి రానున్నాయి. ఈ రెండు చిత్రాలు విడుదలైన రెండు వారాలకు మాస్ జాతర విడుదల కానుందట. ఎంతో కొంత పోటీ ఈ చిత్రాల నుండి మాస్ జాతర ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మాస్ జాతర చిత్రంలో రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తుంది. వీరి కాంబోలో మాస్ జాతర రెండో చిత్రం. ధమాకా చిత్రంతో రవితేజ-శ్రీలీల సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ధమాకా చిత్రానికి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. రవితేజ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నాడని సమాచారం. అనంతరం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ మూవీ చేస్తున్నారని టాక్.