https://oktelugu.com/

Bollywood Actress: నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది.. మీ అందరి ఆశీర్వాదం కావాలంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి….

సినిమా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ పెళ్లిళ్ల గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందు మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేసి ఒకరికి ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 05:55 PM IST

    Masaba Gupta announces pregnancy

    Follow us on

    Bollywood Actress: సినీ సెలబ్రిటీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పిస్తారు. కానీ నిజ జీవితంలో వాళ్ల పర్సనల్ లైఫ్ ను కొంతమంది చాలా అద్భుతంగా లీడ్ చేస్తుంటే, మరి కొంత మంది మాత్రం చాలా కష్టాలు పడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ పెళ్లిళ్ల గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందు మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేసి ఒకరికి ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు.

    ఆ తర్వాత పిల్లలు పుట్టగానే వాళ్ల మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. ఈమధ్య ఇలాంటివే చాలా ఎక్కువవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ నటి అయిన నీనా గుప్తా కూతురు అయిన మసాబా గుప్తా ప్రస్తుతం ప్రిగ్నెంట్ అనే విషయం సోషల్ మీడియా వైరల్ అవుతుంది.ఇక మసాబా బాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈమె మొదట ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ని మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ నటిగా మారి నటి గా సెటిల్ అయింది.

    ఇక మసాబా చాలా రోజులపాటు సత్యదీప్ తో రిలేషన్ షిప్ ను మెయింటెన్ చేసి ఫైనల్ గా 2023 వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ పెట్టింది. “మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి” అంటూ ఇన్ స్టా లో షేర్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరీనాకపూర్, కృతి సనన్, సారా టెండూల్కర్, బిపాసా బసు, అనన్య పాండే లాంటి సెలబ్రిటీలు అభినందనలు తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే మసాబా 2023 లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వీళ్ళ పెళ్లికి ఆమె నాన్న అయిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రీచార్డ్స్ తో పాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వీళ్ళ పెళ్లికి హాజరయ్యారు.

    అయితే మాసాబా ముందు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన మధు మంతెనను వివాహం చేసుకుంది. అయితే వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని విభేదాల వల్ల వీళ్ళ బంధం అనేది ఎక్కువ కాలం నిలువలేదు. దాంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత సత్యదీప్ ను ప్రేమించి రెండో.పెళ్లి చేసుకుంది. ఇక సత్యదీప్ కూడా మొదట ప్రముఖ హీరోయిన్ అయిన అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళ మధ్య కూడా గొడవలు రావడంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకొని డివోర్స్ తీసుకున్నారు. ఇక రీసెంట్ గా అదితి రావు హైదరి కూడా హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్ మెంట్ ని కూడా జరుపుకున్నారు. ఇక సత్యదీప్ మసాబా ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటై ప్రస్తుతం పేరెంట్స్ కూడా కాబోతున్నారు…