Maryada Manish remuneration: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంతటి హీట్ వాతావరణం లో నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ కారణంగా బోలెడంత కంటెంట్ వస్తుంది. వీళ్ళు తెలిసి తెలియక చేసే పనుల కారణంగా ఎదో ఒక పెద్ద సమస్య హౌస్ లో క్రియేట్ అవ్వడం, ఆ కారణం చేత గొడవలు పడడం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఈ వారం అయితే వీళ్లంతా భరణి ని టార్గెట్ ఫుల్ నెగిటివ్ అయిపోయారు. కచ్చితంగా వీరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మర్యాద మనీష్ ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ వారం అతను భరణి ని ట్రీట్ చేసిన విధానం కి ఆడియన్స్ బాగా వెర్రిక్కిపోయారని, అందుకే బయటకు నెట్టేశారని అంటున్నారు.
అంతే కాకుండా ప్రతీ చిన్న విషయాన్నీ ఎదో పెద్ద CID ఆఫీసర్ లాగా వంద రీజన్స్ వెతకడం, ఆయన నమ్మిందే నిజమని అనుకోని గుద్ది ఎద్దులాగా ముందుకెళ్లడం వంటి నెగిటివ్ లక్షణాలు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. అంతే కాదు, ఈయనకు అగ్నిపరీక్ష షో లో కూడా ఆడియన్స్ ఓటింగ్ తక్కువే. కామనర్స్ 5 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిన తర్వాత శ్రీముఖి సడన్ గా ఎంట్రీ ఇచ్చి, మర్యాద మనీష్ ని బిగ్ బాస్ లోకి పంపుతుంది. అయితే మనీష్ కి టాస్కులు వచ్చినప్పుడు తన వైపు నుండి నూటికి నూరు శాతం కష్టపడి ఆడుతున్నాడు. ఎదో ఒకటి కొత్తగా చెయ్యాలని తాపత్రయం పడుతూ ఏదేదో చేస్తాడు. చివరికి అది ఆయనకే రివర్స్ అవుతూ ఉంటాయి పాపం. బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్ళు ఇతను ఉండేందుకు అర్హత అయితే ఉంది కానీ, ఈయనకు ఫ్యాన్ బేస్ పెద్దగా లేకపోవడం వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
అయితే మనీష్ వృత్తి పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. లక్షల సంపాదన ఉంది. అందుకే ఆయనకు బిగ్ బాస్ టీం రెమ్యూనరేషన్ భారీగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇతనికి రెండు వారాలకు గానూ లక్షా 40 వేల రూపాయిలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వారానికి 70 వేల రూపాయిలు అన్నమాట. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ మీద విపరీతమైన ఇష్టంతో, కొత్త రకమైన అనుభూతి ని ఎంజాయ్ చేద్దామని ఈ షో లోకి అడుగుపెట్టాడు. గతం లో ఈయన ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకొని బయటకి వెళ్తున్న మనీష్, తన కెరీర్ ని ఎలా తిప్పుకుంటాడో చూడాలి.