ఒకప్పుడు హీరో ముందు నుంచి హీరోగానే ఉండేవాడు. కానీ, జనరేషన్ మారుతున్న క్రమంలో హీరో విలన్ శైలి ప్రవర్తనతో ఆ తరువాత అతగాడు హీరోగా మారతాడు. సినిమాలో నేరస్థులకు కొమ్ముకాసి, ఒకనొక సంఘటనతో మనసు మార్చుకుని మంచి మనిషి అవ్వడం అనేది ఇప్పటి తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా.
అందుకే ఇలాంటి కథతోనే దర్శకుడు మారుతి హీరో గోపీచంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. క్రిమినల్స్ కు వత్తాసు పాడే లాయర్ కథ ఇది. ఇందులో విలన్స్ కి సపోర్ట్ చేస్తూ వారి చెడులో భాగం అయి, చివరకు ఆ చెడు పై యుద్దానికి దిగుతాడు. ఈ సినిమాను మొదట రవితేజ హీరోగా చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుదరలేదు.
అందుకే గోపీచంద్ తో ఈ కథని సినిమాగా చేస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి ఓ విషయం స్పష్టంగా వినిపిస్తోంది. హీరోది నెగిటివ్ షేడ్ వున్న లాయర్ పాత్ర. అంటే.. ‘జాలీ ఎల్ ఎల్ బి 2’ కథకు కాస్త దగ్గరిగా ఉంటుందట. మారుతి ఇదే సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడు. కాకపోతే, మారుతి టైప్ కామెడీ ఈ సినిమాలో ప్రముఖంగా ఉండబోతుంది.
ఏది ఏమైనా మారుతి ఎలాంటి లైన్ తీసుకున్నా.. ఎంటర్టైన్మెంట్ ను ఎలివేట్ చేస్తూ ట్రీట్మెంట్ రాయడంలో అరితేరిపోయాడు. ఎలాగూ లాయర్ పాత్ర, పైగా బోలెడంత ఫన్ కి స్కోప్ ఉంటుంది. మొత్తానికి విలన్ లో హీరో క్యారెక్టర్ ను రాసుకుని మారుతి మరో హిట్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.