Maruthi Nagar Subramanyam Collection: ఆశ్చర్యపరుస్తున్న ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ 4 రోజుల వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రావాలంటే!

ఆగస్టు 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా చూడబోతున్నాము.

Written By: Vicky, Updated On : August 27, 2024 3:58 pm

Maruthi Nagar Subramanyam Collection

Follow us on

Maruthi Nagar Subramanyam Collection: టాలీవుడ్ లో ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులలో నవరసాలను అలవోకగా పలికించగల అతి తక్కువమందిలో ఒకరు రావు రమేష్. లెజెండరీ విలన్ గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రావు గోపాలరావు గారి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రావు రమేష్, తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి హీరోగా మారి మన ముందుకు ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే చిత్రం ద్వారా వచ్చాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడిన కొన్ని మాటలకు ఈ సినిమాకి మార్కెట్ లో బజ్ ఏర్పడింది.

ఆగస్టు 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా చూడబోతున్నాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 2 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అందులో నైజాం ప్రాంతం నుండి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 12 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కోస్తాంధ్ర నుండి ఆరు ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ నుండి 15 లక్షల రూపాయిలు వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ బాగా ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి

కానీ గురువారం రోజు లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం విడుదల కాబోతుంది. కాబట్టి థియేటర్స్ మొత్తం ఆ సినిమాకే వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఈ సినిమా ఈ వీకెండ్ నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్లేషణ ప్రకారం ఈ సినిమాకి మరో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయట. అంటే కచ్చితంగా కోటి రూపాయిల నష్టం మాత్రం వస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం, అదే కనుక జరిగితే నిర్మాతగా సుకుమార్ భార్య కి మొదటి సినిమాతోనే ఫ్లాప్ తగిలినట్టే లెక్క. కానీ మంచి రివ్యూస్ రావడంతో డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా ఆమె లాభపడే అవకాశాలు ఉన్నాయి.