https://oktelugu.com/

Samantha: సమంత లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్… ఇలా మారిపోయిందేంటి? కారణం!

స్టార్ లేడీ సమంత లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సదరు ఫొటోల్లో సమంత మునుపటి కంటే చాలా సన్నగా, వీక్ గా కనిపించారు. దీంతో సమంత అభిమానులు, నెటిజన్లు సమంత కి ఏమైంది అని ఆరా తీస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 27, 2024 / 03:38 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. సమంత బిగ్ స్క్రీన్ పై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. ఖుషి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుని ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే టైటిల్ తో మూవీ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ హని – బన్నీ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

    కాగా సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సమంత షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సమంత ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    సమంత లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సమంత మునుపటిలా లేదు .. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బొద్దుగా, అందంగా ఉండే సమంత ఇలా మారిపోయిందేంటి? ఆమెకు హెల్త్ బాగోలేదా? లేదంటే బాలీవుడ్ షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారా? అందుకే జీరో సైజు మైంటైన్ చేస్తున్నారా? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం నార్త్ పైనే సమంత ఎక్కువగా ఫోకస్ చేస్తుందట. బాలీవుడ్ లో పాగా వేయాలని సమంత ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ లో సమంత తెలుగు సినిమాలు చేస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. మరి సమంత ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది. ఆమె ఆలోచన ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

    మరోవైపు సమంత ఎఫైర్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక ద్వయంలో ఒక్కడైన రాజ్ నిడిమోరు తో ఆమె డేటింగ్ చేస్తుంది అంటూ కథనాలు వెలువడ్డాయి. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 చేసింది. అలాగే హనీ బన్నీ సిరీస్ దర్శకులు కూడా వాళ్లే. చాలా కాలంగా రాజ్ తో సమంతకు పరిచయం ఉంది. రాజ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. అయితే భార్యతో అతడు విడిపోయాడని సమాచారం. మరి సమంత-రాజ్ ఎఫైర్ రూమర్స్ లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.