Naresh
Naresh: గత రెండేళ్లుగా నరేష్ మీడియాలో హాట్ టాపిక్. ఆయన నాలుగో పెళ్లి వార్తలు, మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలు పతాక శీర్షికలకు ఎక్కాయి. దాదాపు ఐదేళ్లుగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం 2022లో బహిర్గతం అయ్యింది. దాంతో మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చింది. నరేష్ మీద దారుణ ఆరోపణలు చేసింది. తిరిగి నరేష్ కూడా ఆమెపై క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇద్దరి మధ్య కోర్ట్ గొడవలు నడుస్తున్నాయి.
ఇటీవల రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ మళ్ళీ పెళ్లి టైటిల్ తో నరేష్ మూవీ చేశాడు. అందులో ఆయన నిజ జీవిత సంఘటనలు చూపించాడు. రమ్య రఘుపతితో పెళ్లి, పవిత్రతో సహజీవనం వంటి విషయాల సమాహారంగా తెరకెక్కించారు. రమ్య రఘుపతిని ఉద్దేశించి రాసిన క్యారెక్టర్ ని నీచంగా చూపించారు. మళ్ళీ పెళ్లి చిత్ర విడుదల అడ్డుకోవాలని ఆమె చూసింది. వ్యక్తిగతంగా నరేష్ జీవితంలో వివాదాలు, ఒడిదుడుకులు ఉన్నా… వృత్తి పరంగా ఆయన సూపర్ హిట్.
మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నరేష్ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన నరేష్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓ టెలివిజన్ షోకి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 50 ఏళ్ళు గడిచిపోయాయి. జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. జీవితంలో కొన్ని తప్పులు చేశానని రమ్య రఘుపతితో వివాహం గురించి ఆయన ప్రస్తావించారు.
పెళ్లి జరిగిందే కానీ సంతోషం లేదు. ఆమె అనేక ఇబ్బందులకు గురి చేసింది. నా కొడుకు తన వద్ద ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. వాడి భవిష్యత్ గురించి భయమేస్తుంది.. అని నరేష్ అన్నారు. కఠిన సమయంలో పవిత్ర లోకేష్ నా జీవితంలోకి వచ్చింది. ఆమె రాకతో అంతా మారిపోయింది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికింది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నరేష్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.