Mark Shankar : ఈమధ్య కాలం లో లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఒక రేంజ్ లో వినపడింది పేరు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich). ఈయన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు అనే సంగతి అందరికీ తెలిసిందే. సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ లోని ఒక కిచెన్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం లో గాయాలపాలై ఆ తర్వాత సురక్షితంగా బయటపడిన ఘటనను ప్రతీ ఒక్కరు చూసారు. కోట్లాది మంది అభిమానులు ఆ చిన్నారి కి ఏమి కాకూడదని ప్రార్థించారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా ఈ అంశంపై వెంటనే స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందరి ప్రార్థనలు ఫలించడం వల్ల మార్క్ శంకర్ కేవలం రెండు రోజుల్లోనే కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత ఒక్కసారైనా మీడియా కి కనిపిస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడ్డారు.
Also Read : పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ వైద్యానికి అయిన ఖర్చు ఇంతేనా..?
కానీ అది జరగలేదు కానీ నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి వెళ్ళినప్పుడు మాత్రం మార్క్ శంకర్ చురుగ్గా తన తల్లితండ్రులతో కలిసి నడుస్తూ ఒక వీడియో లో కనిపించాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంతకు ముందుతో పోలిస్తే మార్క్ శంకర్ ఇప్పుడు చాలా చురుగ్గా ఉన్నాడని, ఆరోగ్యవంతంగా ఉన్నాడని స్పష్టంగా అర్థమైంది. దీంతో అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఆ వీడియో ని మీరు కూడా ఈ క్రింద చూడండి. కుర్రాడు చాలా క్యూట్ గా ఉన్నాడు కదూ. అయితే మార్క్ శంకర్ ముఖం ఈసారి కూడా పూర్తి స్థాయిలో కనిపించలేదు. తెల్ల తోలేసుకొని ఇంగ్లీష్ హీరో లా ఉన్నాడని అభిమానులు అంటుంటారు కానీ, ఒక్కసారైనా పూర్తి స్థాయిలో మార్క్ శంకర్ ని చూపిస్తే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు ఆ అదృష్టం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయాక ఆయన నుండి విడుదల అవుతున్న మొట్టమొదటి చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie). వచ్చే నెల 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా దేశంలో మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇప్పటి వరకు నార్త్ అమెరికా వంటి దేశాల్లో తక్కువ గ్రాస్ వసూళ్లు ఎప్పుడూ రాలేదు. కానీ ఈ సినిమాకు అనూహ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. సుమారుగా 5 ఏళ్ళ నుండి ఆలస్యం అవుతూ వచ్చిన చిత్రం కావడం, దానికి తోడు ఇప్పటి వరకు ఈ సినిమా కంటెంట్ ని తెలియజేసేలా ఒక్క ప్రమోషనల్ వీడియో కూడా బయటకి రాకపోవడం వల్లే ఈ సినిమాకు ఓవర్సీస్ లో అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదని అంటున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ వచ్చాక ట్రెండ్ మారే అవకాశాలు ఉన్నాయి.
Kalyan Mark Shankar ❤❤ pic.twitter.com/emB1q3WQXu
— Kalyan Babu™ (@ram_aduri) May 26, 2025