‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సూర్యుడు బుధుడు కలయికతో ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా ఐదు రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఏ రోజు అనుకూలంగా ఫలితాలు ఉండలు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ప్రియమైన ఒక వ్యక్తి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అకారణంగా ఎవరి వివాదాల్లో తలదుచుకోవద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు తల్లిదండ్రులు సలహాలు తీసుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడతారు. శత్రువులు వ్యాపారులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. బయటి విషయాలను ఎక్కువగా పట్టించుకోకుండా ఉండాలి. ఇంట్లో రహస్యాలు బయటకు చెప్పకుండా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మరింత సంతోషంగా ఉండగలుగుతారు. కొందరు ఎగతాళి చేసిన వారిని దూరంగా ఉండటమే మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో సవాలను ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధించిన వివాదాలను ఉంటే పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో ఆ విషయంలో ఉద్రిక్తత ఉంటుంది. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కీలక నిర్ణయం తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లొద్దు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు కొన్ని పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా వివాదం తలెత్తితే మౌనంగా ఉండడమే మంచిది. జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందుకుంటారు. పిల్లల చదువు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి. ఏ పని చేపట్టిన సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంటుంది. అయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. అనవసరంగా మాట్లాడితే వివాదాలు తలెత్తుతాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. స్నేహితుల్లో ఒకరి ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా బాగుంటుంది. ఇంటి నిర్వహణ కోసం ఖర్చులు పెరుగుతాయి. సొంత వాహనాలపై ప్రయాణాలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా ఉండాలి. అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు అనేక సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపడతారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు బంధువులతో సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యల విషయంలో సంయమనం పాటించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఒత్తిడి నుంచి దూరం అవుతారు.