Marina- Faima: బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం అయ్యినప్పటి నుండి ఈరోజు జరిగినంత హీట్ డిస్కషన్స్ తో నామినేషన్స్ ఇప్పటి వరుకు జరగలేదనే చెప్పాలి..గత వారం బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ వల్ల హౌస్ లో ఉన్న ప్రతిఒక్కరు చాలా సీరియస్ గా ఆట ఆడారు..ఎప్పుడు చాలా సున్నితంగా ఆటలు ఆడుతూ ఉండే మెరీనా కూడా గత వారం తన ఆట తీరుని బాగా మార్చుకుంది.

కానీ మొన్న శనివారం జరిగిన ప్రోగ్రాం లో అక్కినేని నాగార్జున గారు ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్కరిని పిలిచి ‘మీకు ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు’ అని అడగగా అధికశాతం మంది ఇంటి సభ్యులు మెరీనా కి వోట్ వేశారు..ఇక ఈరోజు జరిగిన నామినేషన్స్ లో కూడా ఇంటి సభ్యులు ఎక్కువగా మెరీనా గారికే నామినేషన్స్ వేశారు..అయితే మెరీనా ఫైమా కి నామినేషన్స్ వేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు హీట్ వాతావరణం లో మాటల యుద్ధం నడిచింది.
ముందుగా ఫైమా మెరీనా ని నామినేట్ చేస్తూ ‘ఉన్నవారిలో మీరు కాస్త తక్కువ ఆడుతున్నారు అని అనిపించింది..అందుకే మిమల్ని నామినేట్ చేస్తున్నాను’ అని చెప్పి నామినేట్ చేస్తుంది..అప్పుడు మెరీనా మాట్లాడుతూ ‘మొన్న కూడా నేను బాగా ఆడాను అని నువ్వే చెప్పావు..ఇప్పుడు మళ్ళీ నేను ఆడటం లేదు అనే కారణం తో నామినేట్ చేస్తున్నావు..నేను తక్కువ ఆడాను అంటున్నావు..కానీ ప్రతి గేమ్ లో నా పార్టిసిపేషన్ ఉంటుంది కదా’ అని అడుగుతుంది..అప్పుడు ఫైమా ‘ఉన్నవారిలో మీరు తక్కువ కదా అక్క..అందుకే నేను నామినేట్ చేస్తున్నాను’ అని చెప్పుకొస్తుంది.
ఇక ఆ తర్వాత మెరీనా కి నామినేషన్ చేసే సమయం వచ్చినప్పుడు ఫైమా ని నామినేట్ చేస్తుంది..ఆమె మాట్లాడుతూ ‘మొన్న నన్ను డిజాస్టర్ కంటెస్టెంట్ గా నామినేట్ చేసావు కదా..ఎవరికో సమస్య వస్తే అది పట్టుకొని నువ్వు నన్ను నామినేట్ చెయ్యకుండా..నీకు నా వల్ల ఏదైనా సమస్య వస్తే నామినేట్ చెయ్యాలి..ఒకరి కోసం మాట్లాడడానికి నువ్వు బిగ్ బాస్ లోకి రాలేదు కదా’ అని ఆడుతుంది..అప్పుడు ఫైమా వెంటనే సమాధానం చెప్తూ ‘ఒక ఇంటి సభ్యురాలిగా మీకు అనిపించింది చెప్పొచ్చు అనే స్వేచ్ఛ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు నేను నాకు అనిపించినా ఒపీనియన్ ని చెప్పుకోవడం లో తప్పు ఏమి ఉంది’ అని అడుగుతుంది ఫైమా.

అప్పుడు మెరీనా మాట్లాడుతూ ‘నేను ఇక్కడ ఒక కంటెస్టెంట్ ఫైమా..ఒక కంటెస్టెంట్ గా నేను నా ఒపీనియన్ ని ముందు పెట్టుకోవచ్చు’ అని అంటుంది..అప్పుడు ఫైమా మాట్లాడుతూ ‘ఒక కంటెస్టెంట్ గా నీ ఒపీనియన్ ని ముందు పెట్టుకోవచ్చు..వెనకాల పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు’ అంటూ మాట్లాడడం తో మెరీనా కి బాగా కోపం వస్తుంది..అప్పుడు ఆమె మాట్లాడుతూ ‘నువ్వు నీ ఒపీనియన్ నీ వెనుక పెట్టుకో..మాటలు మాట్లాడేటప్పుడు మర్యాద గా మాట్లాడుతూ..నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు..చిన్న పెద్ద తేడా తెలుసుకో..హౌస్ లో ఉండాలంటే కేవలం ఆడడం మాత్రమే కాదు..మానవత్వం కూడా ఉండాలి’ అంటూ మెరీనా చెప్తుంది..అలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం సుమారు పది నిమిషాల పాటు సాగుతుంది.