https://oktelugu.com/

Marakkar: ‘మరక్కర్’​ సినిమా నుంచి సాంగ్​ రిలీజ్​.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కర్​: అరబికడలింటే సింహమ్‌. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘కనులను కలిపిన కలవే.. యే యమునన ఎగసిన అలవే..’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 12:53 PM IST
    Follow us on

    Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కర్​: అరబికడలింటే సింహమ్‌. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘కనులను కలిపిన కలవే.. యే యమునన ఎగసిన అలవే..’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. రోనీ రఫెల్​ సంగీతం అందించగా.. సత్యప్రకాశ్​, చిన్మయి కలిసి ఆలపించారు. వెన్నెలకంటి పాటను రచించారు.

    కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది ఇటీవలే ఓ ప్రచారం సాగింది.. అయితే, వాటన్నింటికీ చెక్​ పెడుతూ.. మరక్కర్​ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు స్ప,్టం చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో  అర్జున్, సునీల్‌ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    కాగా, గతంలో మన్యం పులి, లూసీఫర్​, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్​లాల్​. ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మోహన్​లాల్​ తెలుగులోనూ కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు.  ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.