https://oktelugu.com/

వారెవ్వా.. ఛార్టెడ్ ఫ్లైట్ లో దీపిక ఎస్కేప్.. మీడియా అడ్డుకుందా?

హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. ఓవైపు సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగి కీలక విషయాలను సేకరిస్తుండగా.. మరోవైపు మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తుండటం గమనార్హం. డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పేర్లు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో మీడియా అత్యుత్సాహం చూసినవారంతా అవాక్కవుతున్నారు. డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ మీడియా ముఖంగా ఎలాంటి పేర్లు వెల్లడించపోయినా జాతీయ మీడియా సంస్థలు ఊహగానాలతో వార్తలను వడ్డిస్తున్నాయి. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 12:37 PM IST

    deepika padukone

    Follow us on

    హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. ఓవైపు సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగి కీలక విషయాలను సేకరిస్తుండగా.. మరోవైపు మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తుండటం గమనార్హం. డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పేర్లు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో మీడియా అత్యుత్సాహం చూసినవారంతా అవాక్కవుతున్నారు.

    డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ మీడియా ముఖంగా ఎలాంటి పేర్లు వెల్లడించపోయినా జాతీయ మీడియా సంస్థలు ఊహగానాలతో వార్తలను వడ్డిస్తున్నాయి. తాజాగా ఓ మీడియా సంస్థ బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని తప్పించుకునేందుకు ప్రయత్నించిందంటూ కథనాలు రాస్తున్నాయి. దీపిక ఎస్కేప్ అంటూ కథనాలు ప్రసారాలు చేస్తుండటంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పలువురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు పంపించింది. రకుల్ ప్రీతిసింగ్.. సారా అలీఖాన్.. దీపికా పదుకోన్ లు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక పదుకోన్ ఈ మూవీ షూటింగులో భాగంగా గోవాలో ఉంది. నిజానికి దీపిక నిన్ననే విచారణకు హాజరు కావాల్సి ఉండేదని.. షూటింగు కారణంగా వెళ్లలేదని తెలుస్తోంది.

    ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు దీపిక షూటింగు నుంచి ముంబైకి బయలుదేరింది. ముంబై విమానశ్రయంలో సారా అలీఖాన్ మీడియాకు దొరికిపోగా.. దీపిక మాత్రం చార్టెడ్ ఫైట్ తీసుకొని ముంబైకి వచ్చింది. దీపిక మీడియాకు దొరకకపోవడంతో ఆమె డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకే చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుందంటూ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. మీడియా అత్యుత్సాహంతో ఊహగానాలు చేస్తూ వార్తలు ఇస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.