Mansion house : మ్యాన్షన్ హౌస్(Mansion House) అనే పేరు ఎత్తితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). సరదాగా అప్పుడప్పుడు మనం మన స్నేహితులతో కూర్చొని తాగే మందు అంటే బాలయ్య కి ఎంతో ఇష్టం. ఎన్నో సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్నీ బహిరంగంగా చెప్పుకొచ్చాడు. కేవలం బాలయ్య కారణంగా ఈ బ్రాండ్ కి విలువ ఎవ్వరూ ఊహించినంత పెరిగింది. బాలయ్య సపోర్ట్ చేసాడనే కారణంతో ఈ బ్రాండ్ మందు ని సేవించే వారు లక్షల్లోనే ఉంటారు. అందుకే బాలయ్య క్రేజ్ ని పూర్తి స్థాయిలో వాడుకొని మ్యాన్షన్ హౌస్ సంస్థ ఒక లేటెస్ట్ యాడ్ వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియో ని నిన్న విడుదల చేయగా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నెటిజెన్స్ నుండి బాలయ్య బాబు తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంటున్నాడు.
Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!
ఈ వీడియో లో ముందు ఒక గోల్డెన్ కీ క్లోజప్ షాట్ లో స్లో మోషన్ లో వచ్చి ఒక తలుపు ని తెరుస్తుంది. లోపల బాలయ్య ఒక సింహాసనం మీద గాల్లో తేలుతూ ఉంటాడు. ఆ గోల్డెన్ కీ అతని వైపు వెళ్ళగానే ‘వన్స్ ఐ స్టెప్ ఇన్’ అనే డైలాగ్ కొడుతాడు. ఇక ఆ తర్వాత ‘వెల్కమింగ్ టు యువర్ ఫేవరేట్ హౌస్’ అని ఇంగ్లీష్ లో టైటిల్స్ పడి ‘మ్యాన్షన్ హౌస్ – ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్’ అని టైటిల్ పడుతుంది. ఇదంతా ఆ ప్రోడక్ట్ నిర్వాహకుల చావు తెలివితేటలని, మ్యాన్షన్ హౌస్ అనే టైటిల్ దేనికి సంబంధించినదో ప్రతీ ఒక్కరికి తెలుసునని, హీరోలతో నీరు గా ఆ పేరు ని ప్రమోట్ చేయిస్తే వాళ్లకు రిస్క్ కాబట్టి, ఈ మార్గం లో ప్రమోట్ చేయిస్తున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కోట్లాది మంది అభిమానులను ప్రభావితం చేసే హీరో మాత్రమే కాదు.
శాసనసభ్యుడిగా మూడు సార్లు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి గెలుపొంది గొప్ప స్థానంలో కూర్చున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎంతో మంది బ్రతుకుల్లో వెలుగులను నింపాడు. అలాంటి బాలయ్య ఇలాంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం, అది కూడా పద్మభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బాలయ్య రియాక్షన్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, కెరీర్ లో ఎవ్వరూ చూడనంత సక్సెస్ ఫేస్ ని చూస్తున్న బాలయ్య, ఇప్పుడు అఖండ సీక్వెల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.